చైనా మెడలు వంచిన భారత్



Want create site? Find Free WordPress Themes and plugins.
బ్రిక్స్‌ దేశాల సదస్సులో పాల్గొని వచ్చారు భారత ప్రధాని మోడీ. ఈ సందర్భంగా చేసిన జియామెన్‌ డిక్లరేషన్‌ గొప్ప విజయం. పాకిస్థాన్‌, ఆఫ్గనిస్థాన్‌ దేశాల ఉగ్రవాద గ్రూపుల పేర్లు ఇందులో చేర్చారు. చైనా ఇందుకు ఆమోదం తెలిపేలా భారత్ ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ చర్య చైనాకు ఇబ్బందే. పొరుగు దేశాలతో జరిగే వ్యాపార, వాణిజ్య సంబంధాలే కాదు.. ఎగుమతి, దిగుమతుల పైనా ప్రభావం చూపుతోంది. ఆర్థిక వేదిక అయిన ‘బ్రిక్స్‌’ అజెండాను ఇది దెబ్బ తీస్తుందని ఆదేశ మేధావుల అభిప్రాయం. ‘తాలిబాన్, ఐఎస్ఐఎల్ /డాషే, అల్‌కాయిదా, దాని అనుబంధ సంస్థలైన తూర్పు టర్కిస్థాన్‌ ఇస్లామిక్ మూవ్మెంట్, ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, హక్కాని నెట్‌వర్క్, లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్, టీటీపీ, హిజ్బ్ ఉట్‌-తహిర్ర్’ తదితర ఉగ్రవాద గ్రూపుల పేర్లను ఇందులో ప్రస్తావించారు. ఉగ్రవాద దాడులను ఖండిస్తామని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. దానిని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోమని డిక్లరేషన్‌ తేల్చి చెప్పింది. 
          గతంలో ఇదే విషయం పై డిక్లరేషన్ చేద్దామని భారత్ ప్రతిపాదించినా చైనా ససేమిరా అంది. కానీ ఇప్పుడు ఒప్పుకోక తప్పలేదు. దౌత్యపరంగా చైనాను నరుక్కురావడంలో భారత్ మైలైన పాత్ర నిర్వహించింది. 1960 తర్వాత చైనా-పాకిస్థాన్‌ సంబంధాలు ఇప్పుడు అతిపెద్ద సవాలును ఎదుర్కోబోతున్నాయి. ఫలితంగా చైనాకు తీవ్రమైన ముప్పు ఉంటుందనేది ఆ దేశ నిపుణుల మాటగా ఉంది. భారత్‌ పరంగా చూస్తే ఇది అతి పెద్ద విజయం అని చెప్పాలి. తను కోరుకున్నది.. కావాలనుకున్నది సాధించుకోగలిగింది. చైనా ఇందుకు అనుమతించి ఉండాల్సింది కాదనే వాదన కామ్రేడ్స్ దేశం నుంచి వచ్చిందంటున్నారు. 
              ఉగ్రవాద సంస్థలకు, ఉగ్రవాదులకు పాక్‌ ఆశ్రయం కల్పిస్తోందని భారత్‌ మొదటి నుంచి చెబుతోంది. అయినా చైనా పాక్ ను వెనకేసుకు వస్తూ ఉంది. పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై దాడికి సూత్రధారి జైషే మొహమ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌. ఆయన పై చర్యలకు భారత్ ఐరాసలో పెట్టిన తీర్మానాన్ని చైనా మొండిగా అడ్డుకుంటోంది. బ్రిక్స్ డిక్లరేషన్‌లో జైషే మొహమ్మద్‌ పేరును ప్రస్తావించడంతో పాక్ కు తలనొప్పి మొదలైంది. ఇంకోవైపు డొక్లామ్ వ్యవహారంలోను దౌత్యపరంగానే చర్చలు ముగించి ఉద్రిక్తతను నివారించింది. మొత్తంగా చైనాకు కనువిప్పు కలిగించేలా భారత్ వ్యవహరిస్తున్న తీరు అభినందనీయం.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*