జగన్ కు హిత బోధ చేసిన సబ్బం హరి



Want create site? Find Free WordPress Themes and plugins.
సబ్బం హరి. కాంగ్రెస్ మాజీ ఎంపీ. ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యాడు. సి.ఎం చంద్రబాబునాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, పవన్ కల్యాణ్ ల వల్లనే టీడీపీ గెలిచిందనే ప్రచారానికి తెరదించారు. చంద్రబాబు తీరే ఆ పార్టీ గెలుపుకు దోహదం చేసిందన్నారు. చంద్రబాబు తమకు మంచి పాలన అందిస్తాడని ప్రజలు నమ్మారు. ఓట్లేశారు. నంద్యాల, కాకినాడలోను అదే చేశారని చెప్పారు. నిజంగా బీజేపీ, పవన్ ప్రభావం ఉంటే ఆ రెండు చోట్ల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే గెలిచిందని గుర్తు పెట్టుకోవాలన్నారు. చంద్రబాబు అభివృద్ధి, పనిని నమ్ముకున్నారు. అదే చేశారు. ఇప్పుడు గెలిచిందని చెప్పారు. 
             జగన్, రోజాల నోటి దురుసే ఆ పార్టీ ఓటమికి కారణమవుతుందని చెప్పారు సబ్బం హరి. జగన్ తప్పు తెలుసుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించారు హరి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లక్ష కోట్లు. కానీ మూడులక్షల కోట్ల అవినీతి జరిగిందని జగన్ చెప్పారు. బడ్జెట్ లేకుండా అంత అవినీతి ఎలా సాధ్యమో చెప్పాలని సబ్బం హరి సవాల్ విసిరాడు. ఇప్పటికైనా జగన్ వాస్తవాలు మాట్లాడితే జనాలు నమ్ముతారు. లేకపోతే ఎప్పటికీ అధికారానికి దూరమవుతారని గుర్తించాలన్నారు. టీడీపీ నేతలు మాట్లాడాల్సిన మాటలు సబ్బం హరి చెప్పడంతో తెలుగు తమ్ముళ్లు ఖుషీ అవుతున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*