ఇరగదీసిన జై లవకుశ



Want create site? Find Free WordPress Themes and plugins.
ఎన్టీఆర్ – బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జై లవ కుశ. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమాలోని పాటలను నేరుగా మార్కెట్ లోకి విడుదల చేశారు. దేవిశ్రీ సంగీతం అదిరిపోయింది. ఫలింతగా సినిమా పై అంచనాలు పెరిగాయి. రావణా శక్తి శాసనా.. ఈ పాట జై పాత్రను గుర్తుకు తెస్తోంది. ఈ పాటకు యంగ్ టైగర్ అద్భుతంగా స్టెప్పులు వేశాడంటున్నారు. ఇక రెండో పాట ట్రింగ్ ట్రింగ్.. స్వప్న సుందరి పాట యూత్ మనసును దోచుకునే వీలుంది. కంపోజింగ్ చాలా బాగుంది. కళ్లలోన కాటుక.. ఈ ఆల్బంలో వచ్చిన సూపర్ మెలోడీ సాంగ్ గా ఉంది. దేవి మార్క్ మ్యాజిక్ ఈ సాంగ్ లో చూస్తాం. తేలి తేలి తేలి పోయా అంటూ వచ్చే ఈ సాంగ్ లిరీక్ వినేవారికి అదుర్స్ అనిపించేలా ఉంది. ఇక చూస్తే ఆగలేరు. దోచేస్తూ.. దేవి మార్క్ మాస్ బీట్ తో వచ్చిన ఈ సాంగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. 
                            నాన్న పిల్లలకు ఇచ్చిన ఆస్తి మీ అభిమానమే. మీ వల్లే నందమూరి వంశం ముందుకెళ్తోంది. ఈ సినిమా పేరు చూస్తుంటే… నాన్న నటించిన ‘లవకుశ’ గుర్తొస్తోంది. ఆ సినిమాలా ఇదీ సూపర్‌ హిట్ కావాలి. అన్నదమ్ముల నేపథ్యంలో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రమిది అన్నారు నందమూరి హరికృష్ణ. అన్న నిర్మాత, తమ్ముడు హీరో. రామకృష్ణ స్డూడియోస్‌లో బాలయ్య హీరోగా నేను సినిమాలు నిర్మించిన రోజులు గుర్తొస్తున్నాయిని గత స్మృతులను నెమరేసుకున్నారు హరికృష్ణ. ఎన్టీఆర్‌ హీరోగా జైలవకుశ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. హరికృష్ణ పెద్ద కుమారుడు కల్యాణ్‌రామ్‌ దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడి గతాన్ని గుర్తు చేశారు. 
                           మనసుకు నచ్చింది చేయాలా? ట్రెండ్‌ ఫాలో కావాలా? ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత కన్‌ఫ్యూజన్‌లో పడ్డాను. బాబీ కథ చెప్పగానే… మనసుకు నచ్చిందే చేయాలనుకున్నా. అంత ఎమోషన్‌ ఉందీ సినిమా అంటూ ఎన్టీఆర్ మనసులో మాట చెప్పారు. ఈ సినిమా ఆడియో వేడుకల సందర్భంగా ఎన్టీఆర్ చాలా అంశాల పై మాట్లాడారు. మా పెద్దన్నయ్య జానకిరామ్‌ కూడా ఈ వేదికపై ఉండుంటే… ‘జై లవకుశ’ పేరుకి సార్థకం అయ్యుండేదేమో. భౌతికంగా ఆయన మా మధ్య లేరు. కానీ అన్నయ్య ఆత్మ ఎప్పుడూ మాతోనే ఉంటుంది. ఈ సినిమా సూపర్‌హిట్‌ అవ్వాలనే కంటే… నాన్నకి 60వ బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నాం. ఈ నెల 2న ఆయన పుట్టిన రోజు.  
                     మా నాన్నను, అమ్మలను కూర్చొబెట్టి మేం సాధించిన విజయం ఇదని ఈ సినిమాతో చెప్పాలనేది మా కోరిక. తప్పకుండా వాళ్లు గర్వపడేలా చేశామని నమ్ముతున్నా. పెదనాన్న, బాబాయ్‌ కలసి చేసిన చిత్రమని మా పిల్లల్లు చెప్పుకోవాలి. నా కెరీర్‌లో మంచి సంతృప్తినిచ్చిన చిత్రమిది అన్నారు ఎన్టీఆర్. మా కుటుంబ వేడుక ఇది. తారక్‌ (ఎన్టీఆర్‌) గురించి చాలా మాట్లాడాలి. ఈ నెల 10న జరగబోయే ప్రీ–రిలీజ్‌ వేడుకలో మాట్లాడతా. ఈ 21న చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు కల్యాణ్‌రామ్‌. 
 
 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*