స్విమ్మింగ్ పూల్ లో దూకేసిన హరితేజ



Want create site? Find Free WordPress Themes and plugins.
బిగ్ బాస్ షో 50 రోజులు దాటింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న ఈ షో లో తాజాగా ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది. ఫలితంగా దీక్ష, అర్చన షోలో కొనసాగుతున్నారు. నవదీప్‌, ప్రిన్స్‌, దీక్ష, అర్చన, ముమైత్ ఖాన్ లు ఎలిమినేషన్ లో ఉండగా.. నవదీప్‌, ప్రిన్స్‌ లు ముందు రోజు సేఫ్‌జోన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్‌లో దీక్ష, అర్చన సేఫ్‌గా ఉన్నట్టు ప్రకటించడంతో ముమైత్ ఖాన్ ఇంటికి వెళ్లక తప్పలేదు. గతంలో ఒకసారి ముమైత్ ఖాన్ ఎలిమినేట్‌ అయినా బిగ్‌బాస్‌ హౌజ్‌లో గడిపేందుకు అవకాశం ఇచ్చారు. రెండురోజులు బయట ఉన్న ముమైత్ ఖాన్.. ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా ధన్ రాజ్ ను ఓ ఆట ఆడుకుంది. కావాలని కసి తీర్చుకున్నట్లు కనపడింది ముమైత్. అదే దెబ్బతీసింది. ఆటను ఆటలా కాకుండా.. వ్యక్తిగతంగా తీసుకోవడం ఇబ్బందిని తెచ్చి పెట్టింది. అందుకే ఓట్లను వేసే వారు ముమైత్ ఖాన్ ను పక్కన పెట్టారు. 
                కానీ వెళుతూ వెళుతూ ముమైత్ బిగ్‌బాంబ్‌ను హరితేజపై విసిరింది. ఈ టాస్క్ ప్రకారం హౌజ్ లో ఉన్న సభ్యులు గేమ్స్ నిబంధనలను ఉల్లంఘించినప్పుడల్లా.. హరితేజ వెళ్లి స్విమ్మింగ్‌పూల్‌లో దూకాలని చెప్పారు. అంతే అర్చన ఇంగ్లీష్ లో మాట్లాడటంతో నిబంధన ఉల్లంఘించినట్లు అయింది. అంతే ఎన్టీఆర్ ఆమెకు ఆదేశాలిచ్చారు. వెంటనే స్విమ్మింగ్‌పూల్‌ లో దూకారు హరితేజ. బుర్రకథ బాగా చెప్పిన హరితేజను మెచ్చుకున్నారు ఎయిర్ టెల్ కాలర్.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*