సికింద్రాబాద్ లో ఉప ఎన్నికలు వస్తాయా…



Want create site? Find Free WordPress Themes and plugins.
బండారు దత్తాత్రేయ మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. గవర్నర్ గా వెళతారనే వాదనుంది. అదే జరిగితే సికింద్రాబాద్ ఎంపీకి ఎన్నికలు ఖాయం. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బరిలోకి దిగుతోంది. ఫలితంగా ఆ పార్టీని ఓడించడం అంత తేలిక కాదు. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి గెలిచే అవకాశాలు బాగానే ఉంటాయి. ఇలాంటి సమయంలో ఆ సీటును పోగొట్టుకునేందుకు బీజేపీ హైకమాండ్ సిద్ధంగా ఉంటుందా అనే వాదన లేకపోలేదు. ఏదో మంత్రి పదవికి రాజీనామా చేశారు కాబట్టి బండారు కోసం ఊరడింపు మాటలు చెప్పారంటున్నారు. గవర్నర్ గిరి కచ్చితంగా ఇస్తారని కొందరు చెబుతుంటే.. లేదు కావాలని అలా చెప్పారంటున్నారు. 
                     60 ఏళ్లు నిండిన వారికి పార్టీలో కీలక పదవుల నుంచి తొలగించే ఆలోచన చేస్తోంది కమలం పార్టీ. ఇప్పుడు బండారుకు 70 ఏళ్లు దాటాయి. అందుకే పక్కన పెట్టారంటున్నాయి. కేబినెట్ విస్తరణ తొలి దశలోను దత్తన్నకు టిక్కెట్ దక్కలేదు. తర్వాత వచ్చినా అప్పుడే రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వస్తాయంటున్నారు. మూడుసార్లు సికింద్రాబాద్ నుంచి బండారు గెలిచారు. గవర్నర్ గా ఆయన వెళితే తెలంగాణకు చెందిన మురళీధర్ రావు పోటీకి దించే ఆలోచన పార్టీ పెద్దలుచేస్తున్నారనే ప్రచారం వస్తోంది. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి బరిలోకి దింపుతారంటున్నారు. మరోవైపు తెలంగాణ సి.ఎం కేసీఆర్ హస్తినలోనే మకాం వేయడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయని చెబుతున్నారు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*