గవర్నర్ గా బండారు దత్తాత్రేయ



Want create site? Find Free WordPress Themes and plugins.
కేంద్ర మంత్రిగా రాజీనామా చేసిన బండారు దత్తాత్రేయకు గవర్నర్ పదవి దక్కనుంది. ఈ మేరకు బీజేపీ పెద్దల నుంచి ఆయనకు హామీ వచ్చిందని తెలుస్తోంది. వయసు 70 ఏళ్లు దాటడంతోనే ఆయన్ను తప్పించారనే ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో తెలంగాణకు చెందిన పార్టీ నేత మురళీధర్ రావుకు కేంద్ర మంత్రి పదవి దక్కనుంది. ఇక ఏపీ కోటా కింద… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, మరోవైపు రాం మాధవ్ లకు కేంద్ర కేబినెట్ లో చోటు ఇవ్వనున్నారు. యువతను ప్రొత్సహించాలనే ఆలోచనతోనే బండారును పక్కన పెట్టారంటున్నారు. 
          వాస్తవంగా 2014లో జరిగిన తొలి కేబినెట్ విస్తరణలో బండారు దత్తాత్రేయకు చోటు కల్పించలేదు. రెండోసారి విస్తరణ జరిగినప్పుడు సీటు ఇచ్చారు. ఇప్పుడు మూడోసారి విస్తరణ జరగక ముందే ఆయన తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ముందస్తు వ్యూహంలో భాగంగానే ఈ మార్పులు చేశారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో మరింత యాక్టివ్ గా పనిచేసే వారికి మంత్రి పదవి ఇవ్వాలనేది వారి నిర్ణయంగా ఉన్నట్లు సమాచారం. సికింద్రాబాద్ నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన బండారు దత్తాత్రేయ గతంలో వాజ్ పేయి ప్రభుత్వంలోను మంత్రిగా సేవలందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏ రాష్ట్రానికి గవర్నర్ గా వెళతారనేది ఆసక్తికరంగా మారింది. సిహెచ్ విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తమిళనాడు వ్యవహరాలను ఆయన చక్కపెడుతున్నారు. ఏపీకి బండారును గవర్నర్ గా పంపాలనే ప్రతిపాదన టీడీపీ అధినేత నుంచి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*