‘పైసా వసూల్’ సినిమా సమీక్షWant create site? Find Free WordPress Themes and plugins.
రేటింగ్ : 3/5
నటీనటులు : నందమూరి బాలకృష్ణ, శ్రియ, ముస్కన్ సేథి, కైరా దత్, కబీర్ బేడి, అలీ, పృథ్వీ, పవిత్రా లోకేష్, విక్రమ్‌ జిత్‌ తదితరులు 
నిర్మాత : ఆనంద ప్రసాద్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : పూరి జగన్నాద్
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ : ముఖేష్. జి
ఎడిటర్ : జునైద్ సిద్ధిక్
నిర్మాణం : భవ్య క్రియేషన్స్
పరిచయం….
బాలయ్య సినిమా అంటేనే అంచనాలు ఎక్కువ. అలాంటిది చాలా కాలంగా ఊరించి ఊరించి వచ్చిన సినిమా కావడంతో అభిమానులు ధియేటర్లకు క్యూ కట్టేశారు. నందమూరి బాలయ్య, పూరీ జగన్నాద్ కాంబినేషన్‌ కావడంతో ఇంకాస్త ఎక్కువగానే ఊహించేసుకున్నారు. ముందుగానే విదేశాల్లో షోలు పడ్డాయి. ఫలితంగా బాగుందనే మౌత్ పబ్లిసిటీ ముందే వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లోను ఉదయం నుంచే ప్రీమియర్ షోలు వేశారు. సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్కరు అద్భుతమని ట్వీట్లు చేస్తున్నారు. పూరీ జగన్నాథ్ మార్క్ ఈ సినిమాలో కనిపించింది. సినిమా అంతా బాలయ్య హవానే కొనసాగింది. అంతా వన్ మ్యాన్ ఆర్మీలా ఉంది. బాలయ్యకు పూరీ రాసిన ప్రతి డైలాగు పేలింది. అందుకోసమైనా సినిమాకు వెళ్లాలి. అంతగా బాలయ్య డైలాగ్ లతో ఇరగదీశాడు. పూరీ డైలాగులు సినిమాకు అదనపు బలం. ఇంకోవైపు బాలయ్య ఆ డైలాగులు పలికిన తీరు ఆకట్టుకుంటుంది. 
ఇక కథలోకి వెళితే….
కథ చాలా సింపుల్. జేమ్స్ బాండ్ లా మారు వేషాల్లో వెళ్లి టాస్క్ లు పూర్తి చేస్తాడు తేడా సింగ్ ( బాలయ్య). అలా మన తేడా సింగ్ అందరినీ ఓ ఆట ఆడుకుంటాడు. మాటలతో చేతలతో తనకు అప్పగించిన పని పూర్తి చేస్తాడు. ఈ కథలో అనేక మలుపులు, ఆసక్తికర అంశాలు, పాటలు, మారువేషాలు, డేరింగ్ స్టెప్పులు, వినూత్న ఫైట్లు, ఛేజింగ్ లు ఉన్నాయి. మొత్తంగా అదుర్స్ అని చెప్పాలి.  ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదొక జేమ్స్ బాండ్ లాంటి కథ. జేమ్స్ బాండ్ లా తేడా సింగ్ వ్యవహారం ఉంటోంది. చాలా డేరింగ్ డాషింగ్ గా సాహసాలు చేస్తాడు. బాలయ్య కెరీర్ లోనే ఇలాంటి సినిమా చేయలేదు. ఆ పాత్రలో ఎవరితోనైనా తలపడుతుంటాడు. బిగ్ మార్లో అనే ఇంటర్నేషనల్ డాన్ ని తుదముట్టించేందుకు ఇంటలిజెన్స్ డిపార్ట్ మెంట్ సరైన వ్యక్తి కోసం ఎదురుచూస్తుంటుంది. ఇందుకు తేడా సింగ్ కరెక్ట్ అని నమ్ముతోంది. ఆ టాస్క్ ను తేడా సింగ్ చేశారా… చేస్తే ఎలా చేశాడు. అందుకు ఎదురయ్యే సవాళ్లు ఏంటనేది సినిమా కథ. 
ఎలా చేశారు…
పూరీ మార్కు హీరో పాత్రలో బాలయ్య నటన ఆకట్టుకుంది. తన అభిమానులతో ఈలలు వేయించడం ఖాయం. అభిమానులే కాదు.. బయట వాళ్లు ఈ సినిమాను చూసి మెచ్చుకుంటున్నారు. బాలయ్య బాబు ‘తేడా సింగ్’ గా ఒదిగిపోయాడు. అసలు బాలకృష్ణ కూడ ఇలాంటి పాత్రలు చేస్తాడా అనిపిస్తోంది. కానీ ఆపాత్రలో ఇరగదీశాడు బాలయ్య. గౌతమీ పుత్ర శాతకర్ణిలో చక్రవర్తిగా చేసిన బాలయ్య అద్భుతం. ఇప్పుడు ఇలా తేడా తేడాగా నటించి అసలు ఆయనేనా ఇలా నటించింది అనిపించేలా పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. 
           మేరా నామ్ తేడా.. తేడా సింగ్.. ధిమాక్ తోడా.. చాలా తేడా’.. 36 దోపిడీలు.. 24 మర్డర్లు.. 36 స్టాపింగ్‌లు.. దిస్ ఈజ్ మై విజిబుల్ రికార్డ్ ఇన్ వికీపీడియా’ ‘గొడవల్లో గోల్డ్ మెడల్ కొట్టినోడ్ని మళ్లీ టోర్నమెంట్‌లు పెట్టొద్దు’.. ‘బీహార్‌లో నీళ్లు తాగినవాళ్లని తిహార్‌లో పోయించా.. తు క్యారే హవ్లే’ అనే డైలాగ్ లను మెచ్చుకోకుండా ఉండలేము. తమ్ముడూ… నేను జంగిల్‌ బుక్‌ సినిమా చూడలే. కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలామంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి’… ‘మందేసిన మదపుటేనుగునిరా! క్రష్‌ ఎవ్రీవన్‌’…అంటూ డైలాగులతో, నందమూరి బాలకృష్ణ అలరించారు. బాలయ్య డైలాగులు బయటకు వచ్చేటప్పుడు అభిమానులు చెప్పుకుంటున్నారు. అంతగా గుర్తుండిపోతున్నాయి డైలాగ్ లు. పూరి జగన్నాధ్ సినిమాలో డైలాగులు, హీరో క్యారక్టరైజేషన్ అన్నా ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది ప్రేక్షకులలో. అటువంటి ఇద్ధరు హేమాహేమీల కలయికలో వస్తున్న సినిమా అంటే అంచనాలు ఎక్కువే ఉంటాయి. చానాళ్ల తర్వాత పూరీ హిట్ కొట్టాడు. లేకపోతే పూరీని పక్కన పెట్టేవాళ్లు. ఇక శ్రియ, ముస్కాన్, కైరా దత్ లు ఉన్నంతలో పర్వాలేదనిపించారు. కబీర్ బేడీ, విక్రంజీత్ లు ఆయా పాత్రల్లో బాగానే చేశారు. అలీ కామెడీ అంతగా నవ్వించలేదు. అభిమానులైతే “తేడాసింగ్” గురించి ఒకటే చర్చించుకుంటున్నారు. 
సాంకేతికంగా…
పూరి సినిమాలు ఈ మధ్య ఎక్కువశాతం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. తన చివరి సినిమా “రోగ్” అయితే దారుణమైన నష్టాన్ని మిగిల్చింది. అంతగా ఆ సినిమా ప్లాప్ ఆయన్ను వేధించింది. బాలయ్యతో సినిమా అనగానే మరింత జాగ్రత్తగా ఫోకస్ పెట్టారు పూరీ. తేడా వస్తే తనకు తేడానే కాదు.. ధిమాక్ పోతుందని భయపడ్డాడు. అందుకే తన మార్క్ స్పీడ్ టేకింగ్ తో సినిమాని బాగా నడిపించాడు. హీరోను తీర్చిదిద్దిన తీరు చాలా బాగుంది. బాలకృష్ణలో ఇలాంటి కోణం ఉంటుందని ఎవరూ అనుకోరు. సింహా, లెజెండ్, శాతకర్ణిలాంటి సినిమాల్లో చూసిన హీరో ఇతనేనా అనిపిస్తోంది. ముకేష్ ఫోటోగ్రఫీ బాగుంది. అనూప్ రూబెన్స్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ. ‘మావా.. ఏక్ పెగ్గు లా..’ పాటతో పాటు.. మిగతావి బాగున్నాయి. రీ-రికార్డింగ్ అదనపు బలం. 
విశ్లేషణ….
పూరీ కథనం మలిచిన తీరు బాగుంది. తేడాసింగ్ ను దృష్టిలో పెట్టుకునే ఈ కథ రాశారు. అదే ఆయనకు విజయాన్ని తెచ్చి పెట్టింది. ఫైట్స్ లో కానీ, డైలాగ్ డెలివరీలో గానీ బాలయ్యలో మునుపటి ఉత్సాహం కనిపిస్తోంది. అన్న నందమూరి తారకరామారావు హీరోగా నటించిన ‘జీవిత చక్రం’ సినిమాలోని ‘కంటిచూపు చెబుతోంది’ పాటను ఇందులో రీమిక్స్ చేసారు. ఆ పాటలో బాలయ్య మొదటిసారిగా తండ్రి లా స్టెప్స్ వేసి అలరించాడు. ఈ పాట రాగానే అభిమానులు ఆనందంతో గంతులేశారు. సినిమా మొత్తం బాలకృష్ణనే ఉంటాడు. మొత్తానికి బాలయ్యనే కాదు.. పూరీని మంచి హైట్ మీదకు తీసుకెళ్లింది సినిమా. ఇక పూరీకి తిరిగి దశ తిరిగిందనుకోవాలి.   
ప్లస్ పాయింట్లు…
+ బాలకృష్ణ నటన
+ డైలాగులు
+ పూరి మార్క్ హీరోయిజం
+ అనూప్ రూబెన్స్ సంగీతం,
+ పాటలు
మైనస్ పాయింట్లు
– పాత కథ
– కామెడీ అంతగా ఆకట్టుకోదు
– బ్యాక్ డ్రాప్ షాట్లు
మొత్తంగా… సినిమానే కాదు… “పైసా వసూల్ కు నిలయంగా మారింది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.1 Comment

Leave a Reply

Your email address will not be published.


*