తమిళనాడుపై బీజేపీ కొత్త వ్యూహం



Want create site? Find Free WordPress Themes and plugins.
తమిళనాడు అసెంబ్లీ రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఏకమైన తిప్పలు తప్పడం లేదు. దినకరన్ రూపంలో ప్రమాదం పొంచి ఉండటమే ఇందుకు కారణం. తన వద్ద 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. మరో 21 మంది వస్తారని తెగ హాడావుడి చేస్తున్నాడు దినకరన్. ఈ మేరకు గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి సి.ఎం బలనిరూపణ చేసుకునేలా ఆదేశించాలని కోరారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. దీంతో వారు బంతిని రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కోర్టులోకి విసిరే ప్రయత్నం చేశారు. ఈ మేరకు నిన్న డీఎంకే రాజ్యసభ సభ్యులు టీకేఎస్‌ ఇళంగోవన్‌, తిరుచ్చి శివ, కనిమొళి, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా తదితరులు హస్తినలో రాష్ట్రపతికి వినతిపత్రం ఇచ్చారు. తిరుపతి పర్యటన బిజీలో ఉన్న రాష్ట్రపతి దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 
          రాబోయే కాలంలో తమిళనాడులో పాగా వేసేందుకు పావులు కదుపుతున్న బీజేపీ ఇటు దినకరన్, అటు శశికళ వర్గానికి చెక్ పెడుతూ వస్తోంది. అదే సమయంలో విపక్షమైన డిఎంకేకు ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదు. సందు దొరికితే చాలు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు స్టాలిన్ నేతృత్వంలోని కూటమి సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ వారికి ఆ అవకాశం ఇవ్వకుండానే 2019 వరకు బండిని నడిపించే పని చేయనుంది. అవసరమైతే అసెంబ్లీని కొన్నాళ్ల పాటు సుప్తచేతన వ్యవస్థలో పెడుతోంది. ఇప్పుడు భాజపా చేస్తున్న ఆలోచన ఇదేనంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తమ జెండా పాతాలంటే ఇది తప్పదని అమిత్ షా వంటి వారు ఆలోచిస్తూ తమ బుర్రకు పదును పెడుతున్నారు. 
               అసెంబ్లీలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంఖ్య 135. ఇందులో 19 మంది దినకరన్‌ వర్గంలో చేరారు. మరో తొమ్మిది మంది వరకు ఆయనతో టచ్ లో ఉన్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వే చెబుతోంది. వారు బయటకు వెళ్లడంతో సర్కారు బలం 113కు పడింది. సాధారణ మెజారిటీకి మరో ఐదు స్థానాలు కావాలి. అందుకే సి.ఎం పళనిస్వామి అసమ్మతి, అసంతృప్త నేతలను బుజ్జగించే పని చేస్తున్నా.. ఇంకా ఒక కొలిక్కి రావడంలేదు. మరోవైపు రాష్ట్రపతి తీసుకునే నిర్ణయం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*