మంత్రి పదవికి బండారు రాజీనామా



Want create site? Find Free WordPress Themes and plugins.
కేంద్ర మంత్రి దత్తాత్రేయ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక నేత అతనే. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయనతో హైకమాండ్ రాజీనామా చేయించింది. ఆదివారం ఉదయం కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్న నేపథ్యంలో మంత్రులు రాజీనామాలు చేశారు. వారిలో రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ, ఉమాభారతి, కల్‌రాజ్‌ మిశ్రా, నిర్మలా సీతారామన్, సంజీవ్‌ బలియాన్, మహేంద్ర పాండేలు ఉన్నారు. కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ సహాయమంత్రి దత్తాత్రేయ పదవికి రాజీనామా చేస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ తన పదవి కాలం రెండేళ్లు ఉండగానే ఆయనతో రాజీనామా చేయించడం ఆశ్చర్యమే. సికింద్రాబాద్‌ ఎంపీ అయిన బండారు దత్తాత్రేయ వాజపేయి కాలంలో మంత్రిగాను సేవలందించారు. దత్తాత్రేయకు కీలకమైన పదవి అప్పగిస్తారనే చర్చ సాగుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*