పోలవరానికి పెరుగుతున్న ప్రాధాన్యత



Want create site? Find Free WordPress Themes and plugins.
నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రం తీరు మారుతోంది. చంద్రబాబు సర్కారును ఇంకా బలంగా నమ్ముతోంది. టీడీపీకి దూరమైతే లాభం లేదని భయపడుతోంది. అందుకే చంద్రబాబుతో కలిసిపోయేందుకే వారు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మధ్యలో జగన్ పార్టీకి వెళితే ఎలా ఉంటుందనే విషయంపై సమాలోచనలు జరిపినా.. అది బెడిసి కొట్టే అవకాశాలున్నట్లు ఆలోచనలు చేసింది. అందుకే ఇప్పుడు నవ్యాంధ్రకు నిధుల వరద కురిపిస్తోంది. వరద నీటిని ఒడిసి పట్టుకునే పోలవరం ప్రాజెక్టుకు నిధులను విడుదల చేసింది.  
                        పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికే ఖర్చు చేసిన మొత్తంలో రూ.979.36 కోట్లను తాజాగా మంజూరు చేసింది కేంద్ర జలవనరులశాఖ. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 2019 నాటికి సుమారు రూ.24 వేల కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించడం శుభ పరిణామం. ఈ ఏడాది రూ.3,500 కోట్లు, వచ్చే రెండేళ్లలో ఏటా రూ.9వేల కోట్ల చొప్పున కేటాయించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ వారికి సరైన దిశా నిర్దేశం చేశారంటున్నారు. నిధుల విడుదలకు సంబంధించి కుదిరిన ఒప్పందంలో వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ప్రాజెక్టు పనుల్లో లక్ష్యానికి అనుగుణంగా సాగాలి. రాష్ట్ర ప్రభుత్వం లేదా పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ మేరకు హామీ  ఇవ్వాలి. పనుల వేగం లేకపోతే తగిన కారణాలు చూపాలి. 
                       పోలవరం ప్రాజెక్టులో నాణ్యత నియంత్రణకు ఒక స్వతంత్ర ఏజన్సీని ఏర్పాటు చేయాలి. ప్రతి ఆర్థిక సంవత్సరం చివర్లో కేంద్రానికి ఈ పనులపై ఒక నివేదిక ఇవ్వాలి. పనులు తగిన సమయంలో పూర్తి చేసేలా ప్రాజెక్టు పర్యవేక్షక విభాగం (పీఎంయూ) ఏర్పాటు చేయాలి. పోలవరానికి మరిన్ని కేటాయింపులు ఇచ్చే ఆలోచన చేస్తోంది కేంద్రం. అందుకే అవసరమైతే నాబార్డు నుంచి రుణం ఇవ్వనుంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*