బలహీన వర్గాలకు చంద్రన్న కానుకలు



Want create site? Find Free WordPress Themes and plugins.
నవ్యాంధ్రప్రదేశ్ సి.ఎం చంద్రబాబునాయుడు చెప్పింది చేస్తున్నారు. బీసీలను ఆదుకుంటామని గతంలో ఇచ్చిన హామీలను నేరవేరుస్తున్నారు. ఇందులో భాగంగా తొలిగా బీసీ జంటలకు రూ.25 వేల పెళ్లి కానుకలను ఇవ్వనున్నారు. బీసీల మాదిరే కాపు విద్యార్థులకూ ఉపకార వేతనాలు అందనున్నాయి. పెళ్లి కానుకతో తొలి దశలో 40వేల కొత్త జంటలకు లబ్ధి చేకూరనుంది. అంతే కాదు.. ‘ఆదరణ’తో ఆధునిక పనిముట్లు వారికి చేరనున్నాయి. బీసీ సమాఖ్యలకు సులభ రుణాలు, వాయిదా పద్దతిలో తిరిగి చెల్లింపులు, ఐదుగురున్న గ్రూప్‌కు సబ్సిడీ రుణం, ఒక్కో యూనిట్‌కు 10లక్షల రుణం ఇవ్వనున్నారు. అంతేనా బీసీ, కాపు, బ్రాహ్మణ సంక్షేమంపై సమీక్షలో సీఎం అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీసీ వధూవరులకు ‘చంద్రన్న పెళ్లికానుక’ను ఇస్తున్నారు.
     బీసీ సమాఖ్యల ద్వారా ఇప్పటివరకు 15 మందితో కూడిన సంఘాలకే వ్యాపారాల కోసం సబ్సిడీ రుణాలు ఇచ్చేవాళ్లు. ఇకపై ఐదు మందితో కూడిన బృందాలకూ సబ్సిడీ రుణాలు అందించాలని చంద్రబాబు ఆదేశించారు. ఒక్కో యూనిట్ కు రూ.10లక్షల చొప్పున అందనుంది. కాపు కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. వారి పిల్లల ఉపకార వేతనాలకు రూ.1474.5 కోట్లు, వసతి గృహాలకు రూ.845 కోట్లు, బీసీ సమాఖ్యలకు రూ.300 కోట్లు, స్వయం ఉపాధికి రూ.366 కోట్లు, మొత్తం రూ.5013.5 కోట్లు కేటాయించినట్లు చంద్రబాబు చెప్పారు. 2017-18లో 8.80 లక్షల మంది బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు. అంతే కాదు.. 3.3 లక్షల మంది ఈబీసీలకు ఉపకార వేతనాలు అందనున్నాయి.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*