పద్మనాభ స్వామి ఆలయ లాకర్ లు తెరవడం కష్టమేనా



Want create site? Find Free WordPress Themes and plugins.
కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆ ఆలయంలోని లాకర్ లు తెరిచే విషయంలో ఇప్పటికీ ఇబ్బంది ఉంది. ఆలయ పూర్వపు రాజవంశీకులు లాకర్ లు తెరిచేందుకు ఒప్పుకోవడంలేదు. సుప్రీంకోర్టు నియమించిన అమిక్యూరస్, ప్రముఖ న్యాయవాది గోపాల్ సుబ్రమణ్యం తిరువనంతపురం వెళ్లారు. అక్కడ పూర్వపు ట్రావాన్కూర్ రాజవంశీకుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆలయ లాకర్ (వాల్ట్ బి) తెరవడానికి ఒప్పుకునేది లేదని వారు చెప్పారు. ఆలయ పూజారులు అంగీకరించినా, తాము ఒప్పుకునేది లేమని తేల్చి చెప్పారు. ఈ మేరకు రాజకుటుంబానికి చెందిన అశ్వతి తిరుమల గౌరీ లక్ష్మి తన అభిప్రాయాన్ని తెలిపారు. సుప్రీంకోర్టుకు ఇదే విషయాన్ని తెలుపుతామన్నారు సుబ్రమణ్యం. పద్మనాభ స్వామి భూగర్భ లాకర్ లలో విలువైన బంగారు సంపద ఉందంటారు. 
                 లక్షల కోట్ల విలువైన వస్తు సంపదతో ఈ దేశాన్ని పాలించ వచ్చనే వాదనుంది. ఆ లాకర్ లకు నాగబంధం ఉందని చెప్పుకుంటారు. ఆలయ లాకర్ లు తెరిచేందుకు సిద్ధమైన న్యాయమూర్తి ఒకరు చనిపోయారు. అందుకు సహకరించిన వ్యక్తి రోగానికి గురై మంచనా పడ్డారు. మరో వ్యక్తి అదృశ్యమయ్యారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అరిష్టాలు జరగడంతో ఆలయ లాకర్ లు తెరిచేందుకు సెంటిమెంట్ గా ఒప్పుకోవడం లేదు. అదే సమయంలో ఆ లాకర్ తెరిస్తే ముప్పు వాటిల్లుతుందని.. చెబుతున్నారు. విషయం ఏదైనా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెబుతుందోనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*