నెంబర్ వన్ యారీలో అల్లరి చేసిన బాలయ్య 



Want create site? Find Free WordPress Themes and plugins.
బాలయ్య బాబు నెంబర్ వన్ యారీ షోకు వచ్చారు. ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. పైసా వసూల్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా బాలకృష్ణ అక్కడ అడుగు పెట్టడంతోనే సందడి ప్రారంభమైంది. ఇక ఇంటర్వూలో పంచ్ ల మీద పంచ్ లు పడ్డాయి. ఈ సందర్బంగా బాలయ్య బాబుచేసిన అల్లరి చిన్నపిల్లోడ్ని గుర్తు చేస్తోంది. సినిమాలో మీరు రొమాంటిక్ గా ఉంటారా అంటూ  రానా ఇంకా ఏదో అనబోయారు..ఈ లోపే ‘క్యాబే సాలే’ అంటూ నవ్వులు పూయించాడు బాలయ్య. పక్కనే ఉన్న పూరీ జగన్నాథ్ బాలయ్య చేస్తున్న అల్లరిని అలా చూసి సంబరపడ్డారు. ప్రశ్న అడగాల్సిన రానా కాసేపు తత్తరపాటుకు గురయ్యారు. ఆ తర్వాత హగ్ ఇచ్చే సందర్భంలోను రానా భుజం పైకి గెంతే ప్రయత్నం చేసారు నందమూరి అందగాడు. 
          ఈ షోకు ఎంట్రీ ఇచ్చే ముందే బాలయ్య స్టెప్పులతో అదరగొట్టాడు. పైసా వసూల్ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. ఆ సినిమా ఎలా తీసింది..ఏంటనే విషయాల పై బాలయ్య ఆ షోలో వివరంగా చెప్పారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘పైసా వసూల్ ’ చిత్రం టీజర్, స్టంపర్ తో ఆకట్టుకున్నారు. నిర్మాత వి. ఆనందప్రసాద్ రాజీపడకుండా నిర్మించారని వాటిని చూస్తే అర్థమవుతోంది. భవ్య క్రియేషన్స్ పతాకంపై  నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న గ్రాండ్ రిలీజ్  కానుంది.  శ్రియ, ముస్కాన్, కైరా దత్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌–హాలీవుడ్‌ నటుడు కబీర్‌ బేడి ప్రత్యేక పాత్ర పోషించారు. అలీ, పృథ్వీ, పవిత్రా లోకేష్, విక్రమ్‌ జిత్‌ తదితరులు ప్రత్యేక పాత్రల్లో నటించారు. 
   బాహుబలితో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న భళ్లాలదేవ రానా దగ్గుబాటి ‘నంబర్ వన్ యారీ టీవీ షో’ తో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు బాలయ్య ఈ షోకు రావడం అదనపు ఆకర్షణ కానుంది. నందమూరి బాలయ్య ఇలాంటి ప్రమోషన్లను పెద్దగా పట్టించుకోడు. కానీ ఈ మధ్య ప్రమోషన్ల కోసం వెనుకా ముందు ఆలోచించకుండా వెళుతుండటం ఆసక్తిని పెంచుతోంది.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*