కేసీఆర్ ను కలిసిన ఉదయభాను



Want create site? Find Free WordPress Themes and plugins.
ప్రముఖ టీవీ యాంకర్ ఉదయభాను తెలంగాణ సి.ఎం కేసీఆర్ ను కలిశారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసిన ఆమె తన కవల పిల్లలైన భూమి ఆరాధ్య, యువీ ఆరాధ్యల తొలి జన్మదినోత్సవానికి వచ్చి పిల్లలను ఆశీర్వదించాలని కోరారు. సెప్టెంబర్ 3న హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో పిల్లల తొలి పుట్టిన రోజు వేడుకలు జరగనున్నాయి. ఆమెతో పాటు… ఆమె భర్త విజయ్ కేసీఆర్ ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా తాను రాజకీయాల్లోకి వస్తానని.. సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు ఆమె. 
              2014 ఎన్నికల్లో ఆమె రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరిగింది. టీఆర్ఎస్, బీజేపీలలో ఒక పార్టీలో చేరతారనే ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు ఉదయభాను స్వయంగా కేసీఆర్ ను కలిసి తన మనసులో మాటను వెలిబుచ్చారు. రానున్న కాలంలో సినీ, టీవీ నటులతో ప్రత్యేక సమావేశాన్ని పెట్టాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అంతే కాదు.. పలు కార్యక్రమాలకు వారిని ప్రచారకర్తలుగా వాడుకోనున్నారు. ఇదేసమయంలో ఆమె అడగడంతో కేసీఆర్ సానుకూలంగా స్పందించారంటున్నారు. 
            ఉదయభాను తండ్రి కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్  మండలంలో మూడు సార్లు సర్పంచ్ గా వ్యవహరించారు. కమ్యూనిస్టు పార్టీలోను పని చేశాడు. దీంతో రాజకీయాల గురించి తనకు అవగాహన ఉందని చెబుతోంది ఆమె. దీంతో ఇక ఆమె పార్టీలో చేరడం ఖాయమని చెబుతున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*