శిల్పా డమ్మీ.. జగన్ హీరోగా మార్చే ప్రయత్నమే…



Want create site? Find Free WordPress Themes and plugins.
నన్ను చూసి ఓటేయండి. వైకాపాను గెలిపించండి. ఫ్యాన్ ను గుర్తు పెట్టుకోండి. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో విపక్ష పార్టీ అధినేత జగన్ పదే పదే చెప్పిన మాటలివి. అసలు పోటీలో నిలబడ్డ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి పేరును పెద్దగా ప్రస్తావించలేదు. ఫలితంగా శిల్పా డమ్మీ అయి.. జగన్ ప్రచారంలో హీరోగా మారాడంటున్నారు. అదే అసలుకు మోసం తెచ్చిందని ఇప్పుడు వైకాపాలో జరుగుతున్న చర్చ. శిల్పా మోహన్ రెడ్డి గురించి, ఆయన సేవల గురించి, పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా చేసిన సంగతులను ప్రస్తావించాల్సింది. కానీ ఆ అంశాల కంటే.. సి.ఎం చంద్రబాబునాయుడు, టీడీపీ పై విమర్శలకే ఎక్కువ సమయం కేటాయించారు జగన్. పైగా వ్యక్తిగత విమర్శలు చేశారు. 
                          ఎన్నికల్లో నిలబడినప్పుడు ఎవరైనా తమ పార్టీ గురించి, తమ నేత గురించి చెప్పుకోవాలి. తాము ఏం చేస్తామో ప్రజలకు వివరించాలి. వారి మనసును దోచుకోవాలి. ఒక నమ్మకాన్ని కలిగించాలి. అలా కాకుండా జగన్ వ్యవహరించడంతోనే వైకాపాకు భారీ పరాజయం వచ్చిందంటున్నారు. ధర్మాన్ని గెలిపించండని చెప్పాడు జగన్. తాను చేయదల్చుకున్న, ప్రవేశ పెట్టాలనుకుంటున్న నవ రత్నాలను ప్రస్తావించలేదు. అవన్నీ చెప్పే ఓపిక లేక.. టీడీపీ పై ఎదురు దాడికి దిగడంతోనే ఇబ్బంది వచ్చిదంటున్నారు ఆ పార్టీ నేతలు. అంతే కాదు… రోజా మాటలు తిప్పలు తెచ్చి పెట్టాయనే ప్రచారముంది. 
                        పదవికి రాజీనామా చేయమని గట్టిగా ఆదేశించడంతోనే శిల్పా చక్రపాణి రెడ్డి ఆ పని చేశారంటున్నారు. వాస్తవంగా ఆ అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడంలో వైకాపా విఫలమైంది. నైతిక రాజకీయాల కోసం తాము రాజీనామా చేశామని చెప్పుకోలేకపోయింది. రాజీనామా చేసిన రోజే సి.ఎం చంద్రబాబునాయుడును చంపాలనే జగన్ మాట్లాడటం వల్ల అసలు అంశం పక్కన పడింది. అసలు పోయి కొసరు ప్రచారంలోకి వచ్చింది. అంతే కాదు.. చాలా కారణాలే టీడీపీ గెలుపుకు వైసీపీ పరాజయానికి దోహదం చేసిందన్నది వాస్తవం. కానీ జగన్ తీరు శిల్పా జీవితాంతం గుర్తుండేలా చేసిందంటున్నారు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*