తెలంగాణలో ఏకమవుతున్న విపక్షాలు



Want create site? Find Free WordPress Themes and plugins.
కాంగ్రెస్, కమ్యూనిస్టులు, తెలుగుదేశం. ఒకప్పుడు ఈ మూడు పార్టీలే తెలుగు రాష్ట్రాల్లో హవా సాగించేవి. కాలం మారింది. ఇప్పుడు ఆ మూడు పార్టీలు ఒక్కటవుతున్నాయి. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నాయి. ఉమ్మడి శత్రువు టీఆర్ఎస్ ను ఓడించేందుకు పావులు కదుపుతున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒప్పందాలు చేసుకుంటున్నాయనే ప్రచారం సాగుతోంది. గులాబీ పార్టీ నేత, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఈ మాటలు చెప్పారు. ఖమ్మం జిల్లా ముదిగొండలో కమ్యూనిస్టులపై కాల్పులు జరిపించిన కాంగ్రెస్ బషీర్ బాగ్ లో ఆ కాల్పులలో మరణించినవారికి నివాళి అర్పిస్తోందని ఎద్దేవ చేశారు. బషీర్‌బాగ్‌ కాల్పులకు కారణమైన తెదేపా నేతలతో కాంగ్రెస్‌ నేతలు ఎలా కలుస్తారని గులాబీ నేత అడిగారు. అలాగే ముదిగొండ కాల్పులకు కారణమైన కాంగ్రెస్ తో వామపక్షాలు ఎలా కలుస్తాయని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేయాలని చూస్తున్నారు. అందుకే ఆయనకు వ్యవసాయ నాయకత్వ అవార్డు వచ్చిందన్నారు. దానిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త కామెంట్లు చేయడం మంచిది కాదని హితవు పలికారు కర్నె ప్రభాకర్. 
               వాస్తవంగా తెలంగాణలో విపక్షాలను నిర్వీర్యం చేసే పని ఏప్పుడో ప్రారంభమైంది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, బిఎస్పీ, కమ్యూనిస్టు నేతలను వదల్లేదు కేసీఆర్. అందరినీ తమ పార్టీలోకి తీసుకున్నారు. ఇంకా కొంత మంది తమ పార్టీల్లోనే ఉన్నా.. మెజార్టీ ఎమ్మెల్యేలు వెళ్లడంతో రాజకీయ యవనికపై కదలికలు తీసుకువచ్చింది. పార్టీ మారిన వారితో రాజీనామాలు చేయించే ధైర్యం చాలక కేసీఆర్ గమ్మున ఉన్నాడు. ఇప్పుడు విపక్ష పార్టీలన్నీ ఏకం అయ్యే కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. ఇంధిరా పార్క్ నుంచి ధర్నా చౌక్  తరలింపును అన్ని పార్టీలు తప్పు పట్టాయి. ఇది టీఆర్ఎస్ ను ఆందోళనకు గురి చేసింది.
             ఉమ్మడిగా ఆందోళన చేసినంత మాత్రాన అంతా కలిసి పోటీ చేస్తారనుకుంటే పొరపాటే అవుతోంది. పొత్తుల ఎత్తులు అంత తేలికగా కుదిరేది కాదన్నది వాస్తవం. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*