జగన్ ను నమ్మితే రెడ్లు నాశనమేనట



Want create site? Find Free WordPress Themes and plugins.
జేసీ దివాకర్ రెడ్డి ఏం మాట్లాడినా సంచలనమే. మోహమాటం లేకుండా చెబుతాడు. ఉన్నదీ ఉన్నట్లు చెబుతాడంటారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ కు ఒక్క సీటు రాదన్నాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం దండగ అన్నాడు. అనవసరంగా శిల్పా మోహన్ రెడ్డి డబ్బులు పోగొట్టుకోవడం తప్ప మరేం లేదన్నారు. ఇప్పుడు అదే జరిగింది. టీడీపీ విజయభేరి మోగించగా.. వైసీపీకి నిరాశ ఎదురైంది. మరోసారి వైఎఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గురించి ఆసక్తికరమైన మాటలు చెప్పాడు అనంతపురం ఎంపీ జేసీ. 
         రెడ్లు జగన్ ను నమ్ముకుంటే సర్వనాశనమేనని ఉద్భోదించాడు. ఆయన్ను నమ్ముకుంటే నంద్యాలలో శిల్పా కుటుంబంలా సర్వ నాశనం అవుతారని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెడ్లు అధికారంలోకి రావాలంటే 20 సంవత్సరాలు వేచి ఉండాలని మూడేళ్ల కిందటే చెప్పాడు జేసీ. ఇప్పుడు అదే చెబుతున్నాడు. నంద్యాలలో శిల్పా కుటుంబం లేకపోతే టీడీపీ మెజార్టీ 50 వేలు దాటేదని చెప్పారు జేసీ దివాకర్. మాజీ మంత్రి శిల్పా తన సొసైటీలో రుణాలు తీసుకున్న ముస్లింలకు రూ.35 కోట్లు రద్దు చేశారని చెప్పారు జేసీ. వాటిని రద్దు చేస్తున్నట్లు రుణ విముక్తి పత్రాలిచ్చాడన్నారు. 
          నంద్యాల ఉప ఎన్నికలకు సుమారు రూ.80 కోట్లు శిల్పా డబ్బుల పరంగా ఖర్చు చేసినట్లు చెప్పారు జేసీ. చక్రపాణి రెడ్డి ఎమ్మెల్సీ సీటు కోసం రూ.30 కోట్లు ఖర్చు అయిందన్నారు. గెలుపు పై జగన్ తప్పుడు సంకేతాలివ్వడంతో వైఎస్ఆర్ కార్యకర్తలు బెట్టింగ్ లలో రూ.1000కోట్లు పోగొట్టుకున్నారని చెప్పారు. నంద్యాల ఉపఎన్నికల విజయం 2019 లోను కొనసాగుతుందన్నారు ఆయన. మరోసారి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అందుకే జగన్ ను నమ్మి డబ్బులు వృధా చేసుకోవద్దని రెడ్డి కులస్థులకు చెప్పారు జేసీ దివాకర్ రెడ్డి. అసలు జగన్ మీద రాష్ట్రంలోనే మంచి అభిప్రాయం లేదన్నారు. అందుకే ఎవరూ నమ్మవద్దని చెప్పడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపికైంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*