యంగ్ అమితాబ్ బచ్చన్ అతనేనట



Want create site? Find Free WordPress Themes and plugins.
వివాదాలు లేకపోతే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నిద్రపట్టదు. అందుకే ఎప్పుడూ ఏదో ఒక విషయం పై మాట్లాడుతుంటాడు. ఇప్పుడు ఆయన చూపు అర్జున్ రెడ్డి మూవీ పై పడింది. ఆ సినిమాలో హీరో విజయ్ దేవరకొండకు ఎవరు ఊహించని బిరుదు ఇచ్చాడు రామ్  గోపాల్ వర్మ.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సినీపరిశ్రమ నుంచి మొదటి మెగాస్టార్ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండనే అన్నాడు వర్మ. అంతగా అర్జున్ రెడ్డి సినిమా నచ్చిందట ఆయనకు. ఇప్పటి తరం హీరోలంతా హీరోయిజం చూపించడానికి స్లో మోషన్ ర్యాంపింగ్ షాట్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై ఆధారపడుతున్నారు. ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ పై డిపెండ్ అవ్వకుండా హీరోయిజం చూపించిన మొట్టమొదటి హీరో విజయ్ దేవరకొండ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు వర్మ. 
                             అసలు అమితాబ్ బచ్చన్ తర్వాత తనకు విజయ్ దేవరకొండే కనిపిస్తున్నాడు అని చెప్పాడు. అందుకే విజయ్ ను యంగ్ అమితాబ్ అన్నాడు. అర్జున్ రెడ్డి సినిమా నిండా ముద్దుసీన్లే ఉండటంతో యూత్ క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ నేత విహెచ్ లాంటి వారు గొడవ చేయడంతో అర్జున్ రెడ్డికి విపరీతమైన ప్రచారం వచ్చింది. అందుకే ఇప్పుడు యూత్ ఆ సినిమాలో ఇంకా ఏముందోనంటూ బారులు తీరుతున్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో ఉద్యోగులు ఆ మూవీ కోసం వెళుతున్నారు. అర్జున్ రెడ్డి సినిమా చాలా బాగుందని చెబుతుండగా… అబ్బా భరించలేకపోతున్నాం అంటున్నారు మరికొంత మంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*