పీకే ముందే చెప్పాడట



Want create site? Find Free WordPress Themes and plugins.
నంద్యాల ఉప ఎన్నికల ఫలితాన్ని ముందే చెప్పారట ప్రశాంత్ కిషోర్. సి.ఎం చంద్రబాబునాయుడు పై ఎదురు దాడి మంచిది కాదని.. చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబును చంపేయాలి. ఉరేయాలి. కాలర్ పట్టుకోవాలి వంటి పదాలు వాడటం వల్ల అటు ఇటు ఊగిసలాడే ఓటర్లు చంద్రబాబుకు మద్దతు పలికారంటున్నారు. అందుకే ఇప్పటికైనా జగన్ అలాంటి మాటలను కట్టిపెట్టి ముందుకు కదలాలని చెప్పారట. జగన్ మీ మాటే వింటాడు. మేము చెప్పేది అసలు వినడని చెబుతున్నారట మరోవైపు ఆపార్టీ సీనియర్లు. ఎన్నో ఎన్నికలను చూసిన పీకేకి వాస్తవం తెలిసినా.. జగన్ కు చెప్పేందుకు తటపటాయిస్తున్నట్లు తెలుస్తోంది. లగడపాటితో పాటు.. అన్ని సర్వేలు టీడీపీకి 20 వేల వరకు మెజార్టీ వస్తుందని చెబుతున్నాయి. కానీ అది ఒప్పుకోవడానికి జగన్ పార్టీ నేతలు సిద్ధంగా లేరంటున్నారు.  
                      కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లోను జోరుగా ప్రచారం చేయాలనుకున్నా… కాస్తంత నిరాశగానే ఉన్నాడట జగన్. ఉప ఎన్నికల పోలింగ్ కు రెండు రోజుల ముందు నుంచీ జగన్ ప్రజలకు అందుబాటులో లేడు. దీంతో జగన్ లో నిరాశ ఆవరించిందంటున్నారు. అందుకే కాకినాడ ప్రచారానికి వెళ్లాల్సి ఉన్నా.. వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలు అన్నాక.. గెలుపు ఓటములు సహజం. అంత మాత్రాన నిరాశకు గురి కావాల్సిన అవసరం లేదని పీకే లాంటి వారు నూరి పోస్తున్నట్లు సమాచారం. 
                       సెల్ప్ గోల్ వేసుకోకుండా ఉంటే వైసీపీకి బాగానే కలిసొచ్చేదని.. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదని అర్థమవుతోంది. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని మిగతా పత్రికలు, చానల్స్ చూపిస్తున్నా.. సాక్షిలో కౌంటర్ గానీ.. చర్చ గానీ లేదు. ఆ పార్టీ నేతలు అంత ఉత్సాహంగా గెలుస్తామని చెప్పలేకపోతున్నారట. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*