కాకినాడలో బీజేపీ వీక్.. 20 సీట్ల లోపే పరిమితం కానున్న వైకాపా



Want create site? Find Free WordPress Themes and plugins.
కాకినాడ రాజకీయం రసవత్తరంగా మారింది. నంద్యాల ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని మెజార్టీ సర్వేలు చెప్పాయి. దీంతో కాకినాడ ఫలితం అదే తీరులో ఉంటుందనే చర్చ సాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు లేదు. 2014 ఎన్నికల్లో ఆ జిల్లా ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. తమ మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నగరాలు, పట్టణాలు, గ్రామాల అభివృద్ధి వైపు దృష్టి సారించింది టీడీపీ సర్కారు. దీంతో కాకినాడ ఎన్నికల్లోను విజయం మాదేనని ధీమా వ్యక్తం చేస్తోంది అధికారిక పార్టీ. కాకపోతే మేము గట్టి పోటీ ఇస్తామని వైసీపీ నేతలు చెబుతున్నా.. అంతర్గతంగా మాత్రం… మేయర్ సీటు వారిదేనని చెబుతున్నారు. 
                 గెలుపు ఎవరిదైనా టీడీపీ, వైసీపీ పార్టీలు గట్టిగానే తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంకా మూడు రోజులే ప్రచార గడువు ఉండటంతో ఇటు సి.ఎం చంద్రబాబునాయుడు, అటు విపక్ష అధినేత జగన్మోహనరెడ్డిలు గెలుపు కసరత్తులు చేస్తున్నారు. పేరుకు కార్పొరేషన్‌ ఎన్నికలే అయినా, హడావుడి మాత్రం అసెంబ్లీ ఎన్నికలంతగా ఉంది. ఏడేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో రెండు పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. టీడీపీ తరపున మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావులకు గెలుపు బాధ్యతలను చూస్తున్నారు.
                మరోవైపు వైసీపీ నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు లాంటి నేతలు ప్రచారం చేస్తున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి తొమ్మిది స్థానాలు కేటాయించింది టీడీపీ. వారి గెలుపును టీడీపీ భుజనా వేసుకుంది. సి.ఎం చంద్రబాబునాయుడు తమ పార్టీ నేతలతో మాట్లాడిన సందర్భంలోను బీజేపీ అభ్యర్థులను చూడాలని చెప్పారు. బీజేపీ పక్షాన తరపున మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాకినాడులో మొత్తం 50 వార్డులకు గాను 48 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 38 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు రేసులో ఉండగా… వైసీపీ 48 వార్డుల్లో పోటీ చేస్తోంది. బలం లేని చోట పోటీ చేస్తున్నాం. గెలుపు మీదేనంంటూ వైసీపీ నేతలే చెబుతున్నారట. కాకపోతే అసలు పోటీ చేయక పోతే భవిష్యత్ లో తమ పార్టీకి క్యాడర్ ఉండదని భయపడుతున్నారట. అందుకే పోటీ చేస్తున్నామని వైసీపీ నేతలు చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 
               టీడీపీ అభ్యర్థుల గెలుపుకు ఢోకా లేదంటున్నా.. వైసీపీ మాత్రం 20 సీట్లు మావేనంంటోంది. బీజేపీ పోటీ చేసిన 9 సీట్లల్లో మెజార్టీ మాకే వస్తుందని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తం 20 సీట్ల లోపు తాము తెచ్చుకుంటామని.. అంతకు మించి రావని బాహాటంగానే ఒప్పుకుంటున్నారట. వైసీపీ రెబల్స్ అభ్యర్థుల బెడద లేకపోతే గట్టి పోటీ ఇచ్చేవారమని వారే చెబుతున్నారు. ఇంకోవైపు బీజేపీ అభ్యర్థులు 9 మంది గట్టి వారు కారని తెలుగు దేశం నేతలు అంచనా వేస్తున్నారు. వాటి ఓటమి తమకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ఎత్తులు వేస్తున్నారు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*