అర్జున్ రెడ్డి మూవీ సమీక్షWant create site? Find Free WordPress Themes and plugins.
రేటింగ్ : 3/5
నటీనటులు : విజయ్ దేవరకొండ, షాలిని పాండే, రాహుల్ రామకృష్ణ, కమల్ కామరాజు, సంజయ్ స్వరూప్, ప్రియదర్శి, అదితి మ్యూకల్ తదితరులు. 
నిర్మాత : ప్రణయ్ రెడ్డి వంగ
సంగీతం : రాధన్ 
కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సందీప్ రెడ్డి వంగా
పరిచయ మాటలు…
అర్జున్ రెడ్డి సినిమా విడుదలకు ముందే బాగా ప్రచారం వచ్చింది. హీరో హీరోయిన్ల మధ్య ఉన్న లిప్ లాక్ సన్నివేశంపై రగడ రేగింది. కాంగ్రెస్ నేత విహెచ్ ఆర్టీసీ బస్ పై అంటించిన పోస్టర్ ను చించేయడంతో అంతా అర్జున్ రెడ్డిపై ఆసక్తి కనపరిచారు. మరోవైపు వివాదస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ.. విహెచ్ పై నిప్పులు చెరగడం, ఆ తర్వాత విహెచ్ అంతే స్థాయిలో స్పందించడంతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన పబ్లిసిటీ తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో ఇంతగా హైప్ తెచ్చుకున్న సినిమా మరొకటి లేదు. వ్యతిరేక ప్రచారం వచ్చినా యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. పెళ్లి చూపులు హీరో విజయ్ దేవరకొండ ఈ మూవీతో మరోసారి తన భవిష్యత్ ను పరీక్షించుకుంటున్నాడు. బిగ్ బాస్ షోలో పాల్గొని మరీ తన సినిమాకు ప్రచారం చేసి వచ్చాడు. దీంతో అర్జున్ రెడ్డి పై అంచనాలు భారీగానే పెరిగాయి. 
కథలోకి వెళితే…
అర్జున్ రెడ్డి(విజయ్ దేవరకొండ) మంగుళూరులోని సెయింట్ మేరీ కాలేజీ ఫైనలియర్ మెడికల్ స్టూడెంట్. చదువులో టాప్ ర్యాంకర్. కాలేజీలోనే కాదు… యూనివర్శిటీ టాపర్. కానీ అర్జున్ రెడ్డికి కోపం వస్తే తట్టుకోలేడు. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కుదరదు. ఫలితంగా చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. ఒక్కోసారి అవి పెద్దవిగా మారాతాయి. అందుకే అర్జున్ రెడ్డి చాలా సార్లు కీలక నిర్ణయాలు తీసేసుకుంటాడు. ఇలాంటి సమయంలో ప్రీతి(శాలిని పాండే) అదే కాలేజిలో ఫస్టీయర్ లో చేరుతోంది. తొలి చూపులోనే ఆ అమ్మాయి పై ప్రేమ పుడుతుంది. తనను బాగా ఇష్టపడుతున్నాడని తెలుసుకున్న ప్రీతి అర్జున్ ను ఇష్టపడుతుంది. ఇద్దరి మధ్యా ప్రేమ ముదిరి పాకాన పడుతోంది. పెళ్లి చేసుకోక పోయినా కలిసి కాపురం చేసే పరిస్థితికి వచ్చారు వాళ్లు. పెళ్లికి ముహుర్తం చూసుకుంటుంటారు. కులాలు వేరు కావండతో ప్రీతి తండ్రి ఈ పెళ్లికి ఒప్పుకోడు. ఇది అర్జున్ రెడ్డిలో అసహనం పెంచుతోంది. ఒక దశలో తండ్రి కావాలో నేను కావాలో తేల్చుకోమని చెప్పి సవాల్ విసురుతాడు అర్జున్ రెడ్డి. తన కోపమే తన శత్రువు. తన శాంతమే తనకు రక్ష అనే సూత్రాన్ని పాటించాలనుకుంటాడు. అందుకే కోపాన్ని తగ్గించుకోవడానికి మత్తుమందు తీసుకున్నాడు. ఫలితంగా రెండు రోజుల పాటు స్పృహ కోల్పోతాడు. 
              అర్జున్ కళ్లు తెరిచేసరికి మరో అబ్బాయితో ప్రీతికి పెళ్లి జరిపిస్తాడు ఆమె తండ్రి. ఇది అర్జున్ ను మరింత షాక్ కు గురి చేస్తోంది. అర్జున్ తండ్రి కూడా అతన్ని ఇంటి నుంచి బయటకు పంపిస్తాడు. ఇలా అటు ఇటు వరుస దెబ్బలు తగలడంతో చదువు మీద దృష్టి పోతోంది. మందు తాగనిదే పడుకోలేని పరిస్థితికి వస్తాడు. డ్రగ్స్ కు బానిసవుతాడు. పిచ్చోడిలా అయిపోతాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి ఏంచేస్తాడు. తాను అనుకుంది సాధిస్తాడా.. ప్రీతి పెళ్లితో సుఖాంతంగా ఉంటుందా… ఏం జరుగుతుందనేది మిగతా కథ. 
నటన అదుర్స్…
అర్జున్ రెడ్డి పాత్రలో అద్భుతంగా నటించాడు విజయ్. పెళ్లి చూపులు లోని హీరోకు ఇప్పటికీ చాలా కనపడింది. తన కోసమే ఈ పాత్ర పెట్టారా అన్నట్లుగా నటించేశాడు. ఫలితంగా విజయ్ సినిమాల్లో అవకాశాలను మరింతగా తెచ్చుకునే వీలుంది. హీరోయిన్ షాలిని పాండే తన పాత్రకు న్యాయం చేస్తోంది. విజయ్ కు బాగానే కనెక్టు అయింది. అర్జున్ రెడ్డి స్నేహితుడు శివ పాత్ర రామకృష్ణ బాగానే నటించాడు. మెప్పించాడు. మిగతా వారు బాగానే నటించారు. 
నిర్మాణ పరంగా…
దర్శకుడు సందీప్ రెడ్డికి తొలి సినిమా అయినా పెద్దగా ఇబ్బంది పడలేదు. మంచి లవ్ స్టోరీని తీసుకుని కాస్తంత కొత్తదనంతో తీశాడు. కొన్నిసార్లు అవసరమైన దాని కంటే ఎక్కువ చూపించాడనిపిస్తోంది. కానీ నేచురల్ గా ఉన్నాయి కొన్ని సీన్లు. కానీ సినిమా నిడివి 3 గంటలు ఉంటోంది. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద నిడివి సినిమా చూడటం కాస్తంత కష్టమే. అయినా తన పనితనంతో ఆకట్టుకున్నాడు అర్జున్ రెడ్డి. సినిమా చూస్తున్నంత సేపు బోర్ కొట్టదు. రాజు తోట సినిమాటోగ్రఫీ పర్వాలేదు. పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
ప్లస్ పాయింట్స్
+ విజయ్ దేవరకొండ నటన
+ కథ, స్క్రీన్ ప్లే 
+ క్లైమాక్స్
+ దర్శకత్వ ప్రతిభ
మైనస్ పాయింట్స్
– పెద్దలకు మాత్రమే సినిమాలా అనిపిస్తోంది.
– సెకండాప్ సాగతీత
– నిడివి ఎక్కువ
మొత్తంగా…
కుటుంబ పరంగా కన్నా… ప్రేమికులతో వెళితే సినిమా అద్భుతం.
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*