ట్రిపుల్ తలాక్ రద్దు…



Want create site? Find Free WordPress Themes and plugins.
ట్రిపుల్ తలాక్  పై నెలకున్న ఉత్కంఠకు తెరదించింది సుప్రీంకోర్టు. త్రిపుల్ తలాక్ చెప్పి భార్యను వదిలించు కోవడం అత్యంత హేయ్యమైన చర్య అని చెప్పింది సర్వోన్నత ధర్మాసనం. త్రిపుల్ తలాక్ చెల్లదని తేల్చేసింది. కానీ ఈ విషయంలో పార్లమెంట్ లో ఓ చట్టం చేయాల్సి వుందని చెప్పింది. అప్పటి వరకు తమ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అదే సమయంలో ఇంజక్షన్ ఆర్డర్ వేసింది సుప్రీంకోర్టు. ఈ విషయంలో ప్రభుత్వం చట్టం చేసేంత వరకూ తమ ఆదేశాలు అమలులో ఉంటాయని చెప్పింది. అసలు ఈ కేసులో తాము కల్పించుకోవాలన్న ఉద్దేశం లేదని, కాకపోతే కేసు తీవ్రత దృష్ట్యా, తాత్కాలిక ఆదేశాలు ఇస్తునట్లు తెలిపింది. అలాగే నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ కే వదిలేస్తున్నట్టు ప్రస్తావించింది. ముస్లిం సమాజంతో పాటు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రిపుల్ తలాక్ విషయంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం ఈ కీలక తీర్పునివ్వడం ఆసక్తికరం
           సుదీర్ఘకాలంగా అందరి వాదనలు విన్న న్యాయస్థానం, ట్రిపుల్ తలాక్ పై ఆరు నెలల పాటు స్టే విధిస్తున్నామని చెప్పింది. ఈలోగా చట్ట సవరణ చేసి, ట్రిపుల్ తలాక్ చెల్లకుండా పార్లమెంటులో నూతన చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అప్పటికప్పుడు మూడు సార్లు తలాక్ చెప్పడం ద్వారా భార్యను వదిలించుకోవాలని చూడటం మంచి పద్దతి కాదని చెప్పింది. సెల్ ఫోన్ లేదా సామాజిక మాధ్యమాల్లో తలాక్ చెప్పడం చట్ట సమ్మతం కాదని చెప్పింది. ఇటీవల అరబ్ దేశాల నుంచి తలాక్ పద్దతిలో విడాకులు ఇచ్చిన అంశం చర్చకు వచ్చింది. అటువంటివి ఇక మీదట చెల్లబోవని పేర్కొంది. కొత్త చట్టం తెచ్చేటప్పుడు ముస్లిం లాబోర్డు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని పార్లమెంట్ కు సూచించింది. సుప్రీంకోర్టు. సుప్రీమ్ తీర్పుతో ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి….
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*