వైసీపీని బీజేపీలో విలీనం చేస్తారని కథనం…



Want create site? Find Free WordPress Themes and plugins.
జగన్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని హస్తిన వేదికగా ప్రసారం అవుతున్న చానల్ ఒకటి కథనాలిచ్చింది. టైమ్స్ నౌలో పని చేసిన ఆర్నాబ్ గోస్వామిదే ఈ చానల్. రిపబ్లిక్ పేరుతో టీవీ చానల్ నిర్వహిస్తున్న గోస్వామి చాలా సంచలన విషయాలను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ చానల్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై ఆసక్తికర కథనం ఇచ్చింది. త్వరలో వైసీపీ బీజేపీలో విలీనం అవుతుందనేది ఆ కథనం సారాంశం. ఈ మేరకు మైనింగ్ కింగ్.. కర్నాటక నేత గాలి జనార్దన్ రెడ్డి పావులు కదిపారని వార్త ఇచ్చింది. జాతీయ పార్టీల అండ లేకుండా పార్టీని నడపడం కష్టమని జగన్ భావించాడట. అందుకే ప్రధాని మోడీని కలిసి సాగిల పడ్డారని చెప్పిందా చానల్. అంతే కాదు.. తొలిగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని జగన్ కలిశాడంటున్నారు. ఆ తర్వాతనే బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
               కమలం పెద్దలతో జగన్ మాట్లాడేందుకు గాలి జనార్దన్ తనకున్న పరిచయాలను ఉపయోగించాడంటున్నారు. మోడీ ఇందుకు సానుకూలంగానే స్పందించారని చెబుతున్నారు. ఒక ప్రాంతీయ పార్టీ తమలో కలిసిపోయేందుకు సిద్దమని ప్రకటిస్తే బీజేపీకి అంత కంటే కావాల్సింది ఏముంది. అందుకే బీజేపీ జగన్ ను ఆహ్వానిస్తుందనే కథనం ప్రసారం చేసింది రిపబ్లిక్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతున్న జగన్ బీజేపీకి బాగానే చిక్కాండంటున్నారు నేతలు. నంద్యాల ఉప ఎన్నికలు ముగిశాక.. దీనికి సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చే వీలుంది.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*