చిరంజీవి స్పందన వెనుక కారణమేంటి…



Want create site? Find Free WordPress Themes and plugins.
చాలాకాలం తర్వాత సినీనటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి ప్రజా సమస్యలను పట్టించుకునే తీరిక దొరికింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. తిరుపతిలో ఒక బలహీనవర్గాల కాలనీలోని ఇళ్లను ఖాళీ చేయించే ప్రయత్నం చేయవద్దనేది ఆయన విన్నపం. నంద్యాల ఉప ఎన్నికల వేళ చిరంజీవి లేఖ రాయడం కాస్తంత ఆశ్చర్యమే. చిరంజీవి అసలు రాజకీయాల్లో ఉన్నారా లేదా అనే అనుమానం వస్తోంది. ఇలాంటి సమయంలో లేఖలతో తిరిగి కాస్తంత క్రియాశీలకం అయ్యేలా ఉన్నారు. బీజేపీ గాలం వేస్తున్న నేపధ్యంలోనే చిరు ఇలా లేఖ రాశారంటున్నారు. తిరుపతిలోని 18 వార్డు స్కావెంజ‌ర్స్ కాల‌నీలో ఉంటున్న 160 కుటుంబాలను బ‌ల‌వంతంగా ఖాళీ చేయించే ఆలోచన జరుగుతుందన్నారు. అక్కడ ఉన్న 2.34 ఎకరాల విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కుట్ర జరుగుతోందని చిరంజీవి తన లేఖలో పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆ కాలనీలో పలు అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు చిరంజీవి.
         చిన్న విషయానికి ఏకంగా సి.ఎం చంద్రబాబుకు లేఖ రాసిన చిరంజీవి.. నంద్యాల ఉప ఎన్నికల గురించి ప్రస్తావించలేదు. కాంగ్రెస్ ఎంపీ అయిన చిరు అక్కడకు వెళ్లి ప్రచారం చేయకపోయినా.. కనీసం ప్రకటన చేయలేదు. అందుకే చిరంజీవి పార్టీలో ఉన్నా ఒకటే.. లేకపోయినా ఒకటేనంటున్నారు ఆ పార్టీ నేతలు. పదవులు తీసుకునేందుకు ముందుకు వచ్చిన చిరంజీవి.. ఆ పదవినిచ్చిన పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరకపోవడంపై నిప్పులు చెరుగుతున్నారు హస్తం నేతలు. సిఎం చంద్రబాబు పై విపక్ష నేత చంపాలి.. ఉరి తీయాలి.. కాలర్ పట్టుకుని నిలదీయాలన్నారు. రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఏనాడు పల్లెత్తు మాట అనని చిరంజీవి కావాలని నంద్యాల పోలింగ్ జరిగే ముందు రోజు ప్రకటన జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*