అఖిల్ రెండో సినిమా వివరాలు..



Want create site? Find Free WordPress Themes and plugins.

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అఖిల్‌ సినిమాతో పరిచయమైన అక్కినేని వారసుడుకి నిరాశే మిగిలింది. అందుకే రెండో సినిమాను చాలా జాగ్రత్తగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు విక్ర‌మ్ కుమార్ కె ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున ఈ చిత్రాన్నినిర్మిస్తుండగా.. కొన్ని ఫోటోలు నెట్టింట్లో లీక్ అయ్యాయి. ఇక లాభం లేదనుకున్న నాగ్.. అసలు ఫోటోనే విడుదల చేశారు. అంతే కాదు.. ఇప్పుడు ఇది లీకైతే ఏమైంది. ఇదిగో ఒరిజిన‌ల్. దీని క‌న్నా పెద్ద‌ది, మెరుగైంది ఆగ‌స్టు 21న విడుద‌ల చేస్తామని చెప్పారు. ఈ మూవీకి సంబంధించిన చాలా క్లూస్ మీకు రేపు ఇస్తానంటూ ట్వీట్ చేశాడు. దీంతో అక్కినేని అభిమానులు నాగార్జున ఏం చెబుతారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అఖిల్ ఒక‌ప‌క్కన బజార్లో అందరూ చూస్తుండగానే… ఫైట్ చేస్తూ, మ‌రోప‌క్క గాల్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తున్నాడు ఆ ఫోటోలో. అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

       నాగ్ ట్వీట్ చేయడంతో మరోవైపు అఖిల్ స్పందించాడు. ఆగ‌స్టు 21న అసలైన ఫోటో వ‌స్తుంది. సిద్ధంగా ఉండండి` అంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో అఖిల్ స‌ర‌స‌న క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శిని హీరోయిన్ గా నటిస్తోంది. ఎక్క‌డ ఎక్క‌డ ఉందో తార‌క` అనే పేరును పెట్టేందుకు చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*