దసరాకు పోటీగా రానున్న నెక్స్ట్ నువ్వే సినిమా 



Want create site? Find Free WordPress Themes and plugins.
     బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్. అప్పుడప్పుడు వెండి తెరపై చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తుంటాడు. ప్రభాకర్ లో చాలా కోణాలున్నాయి. ఇటు నటుడు, అటు రచయిత, నిర్మాత,  స్క్రీన్ ప్లే, దర్శకత్వం వంటి మల్టీ టాలెంట్ లున్నాయి. గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ స్టూడియో గ్రీన్ కలయిక లో ఒక సినిమా తీస్తున్నాడు ప్రభాకర్. బన్నీ వాసు నిర్మాణ సారధ్యంలో ఏర్పాటైన ‘వీ4 క్రియేషన్స్ బ్యానర్’ లో దర్శకుడిగా పని చేస్తున్నాడు. ఆది సాయికుమార్ హీరోగా వైభవి హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు “నెక్స్ట్ నువ్వే అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. తమిళం హిట్ మూవీ “యామిరుక్కు భయమే” ను రీమేక్ గా తెలుగులోకి తీసుకువస్తున్నారు. చాలా సరదాగా సాగిపోయే ఈ హర్రర్ కామెడీ సినిమాను దసరాకు విడుదల చేయనున్నారు. సాధారణ సినిమా దసరానాడు పెద్ద సినిమాలకుపోటీగా విడుదల చేయడం మాములు విషయం కాదు. 
        జూనియర్ ఎన్టీఆర్ ‘జై లవకుశ’, మహేష్ బాబు ‘స్పైడర్’ లు దసరాకు రానున్నాయి. మరోవైపు బాలయ్య బాబు పైసా వసూల్ కాస్తంత ముందు రానుంది. ఇలాంటి టాప్ మూవీస్ కు పోటీగా ప్రభాకర్ తన సినిమాను రిలీజ్ చేయడం సాహసం అని చెప్పాలి. ఇన్ని సినిమాల మధ్య ప్రభాకర్ ‘నెక్స్ట్ నువ్వే’కు థియేటర్స్ దొరుకుతాయా అనేది కాస్త అనుమానమే. మొన్న ఒకేసారి సై, జయజానకి నాయక, నేనే రాజు నేనే మంత్రి విడుదలయ్యాయి. కానీ అన్ని బాగానే వసూళ్లు అందుకుంటున్నాయి. కాకపోతే జయజానకీ నాయకకు అప్పుడు ధియేటర్లు సరిగా దొరకలేదు. వారం తర్వాత మరో వంద ధియేటర్లు అందుబాటులోకి రావడంతో జయ జానకీ నాయకను ఆడిస్తున్నారు. చిన్న సినిమా అయినా సరుకు ఉంటే బాగానే ఆడుతోంది.లేకపోతే ఇక అంతే సంగతులు. ఈ భారీ సినిమాల మధ్య తన సినిమా పోటీగా రిలీజ్ చేసి.. చిన్న సినిమాలు ఊహించని ఘన విజయం సాధిస్తున్న సంగతిని గమనిస్తున్నాడు ప్రభాకర్. అందుకే ఇప్పుడు అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తాడనే టాక్ ఉంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*