రాహుల్ ఎప్పుడు నేర్చుకుంటాడో…



Want create site? Find Free WordPress Themes and plugins.
       ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆ అంశాన్ని నెమరు వేసుకుంటే పొరపాటు మాట్లాడే వీలుండదు. ఈ విషయంలో రాహుల్ గాంధీ ఇంకా వెనుకబడి ఉన్నాడు. ఫలితంగా ఏదో ఒకటి మాట్లాడి చేతగాని వాడు అనిపించుకుంటున్నాడు. ముందుగా ప్రిపేర్ అయితే ఇలాంటి ఇబ్బందులు తప్పుతాయి. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ మాట కొస్తే దేశంలోని నాలుగు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే ఇటీవల బెంగళూరుకు వచ్చారు రాహుల్ గాంధీ. తెలంగాణలో రూ.5 కే భోజనం పెట్టడం తెలిసిందే. అలానే ఏపీలోను పెట్టేందుకు చంద్రబాబు సర్కారు పావులు కదుపుతోంది. ఇప్పుడు కర్నాటకలోను అదే పని చేస్తున్నరు. బెంగళూరులో ‘ఇందిరా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. 
      ఈ ప్రారంభోత్సవానికి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాంటిన్ల విషయమై ఆయన మాట్లాడారు.‘ఇందిరా క్యాంటీన్స్‌’ అనబోయి.. పొరపాటున ‘అమ్మా క్యాంటీన్స్‌’ అనేశారు. తమిళనాడులో అమ్మ క్యాంటిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అంతే కాదు… కర్ణాటకలోని అన్ని నగరాల్లో అనాల్సిందిపోయి.. బెంగళూరులోని ప్రతి ఒక్క నగరం అని పలికారు. క్యాంటీన్లకు బదులు క్యాంపెయిన్లు అన్నారు రాహుల్‌. ఆయన మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. బెంగళూరులోని ఇందిరా క్యాంటీన్లలో అల్పాహారం రూ.5, భోజనం రూ.10లకే అందిస్తున్నారు. 2015 ఏడాది బడ్జెట్‌లోనే ఇందిరా క్యాంటీన్ల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో చివరకు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. రానున్న ఎన్నికల కోసమే వారీ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. మాట్లాడటమే చేతగాని నేతకు..ప్రధాన మంత్రి పదవి పై మోజు ఎందుకో అనే విమర్శలొస్తున్నాయి.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*