ఫలిస్తున్న చంద్రబాబు ప్రయత్నాలు 



Want create site? Find Free WordPress Themes and plugins.
నవ్యాంధ్రప్రదేశ్ సి.ఎం నారా చంద్రబాబునాయుడు ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏపీ అభివృద్ధిని ఆపకూడదని ఆయన ఆలోచన. అందుకే ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. పట్టిసీమను పూర్తి చేసి.. గోదావరి, కృష్ణా నదీ జలాలను అనుసంధనం చేసిన ఘనత చంద్రబాబుదే. అందుకే ఇప్పుడు పోలవరం పై పూర్తిగా దృష్టి సారించారు. మరోవైపు కేంద్రం నుంచి నిధుల కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు తాజాగా పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.972 కోట్ల నిధులు ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్దిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.
              నాబార్డు ద్వారా ఈ నిధులను ఇవ్వనున్నారు. గతంలో ఖర్చు పెట్టిన మూడు వేల కోట్లను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం పక్కన బెట్టిన సంగతి తెలిసిందే. కానీ గతంలో ఇస్తామన్న నిధుల్లో రూ. 972 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు ఒప్పుకుంది. నిధుల సత్వర విడుదలకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ఉమాభారతి ఆదేశాలిచ్చారు. అదే సమయంలో పోలవరం పై ఏపీ ప్రభుత్వం అంచనా వ్యయాన్ని యాభై ఎనిమిదివేల కోట్లకు తీసుకువెళ్లగా కేంద్రం మాత్రం ఇంకా 5800 కోట్ల రూపాయలే ఇస్తామని చెప్పడం కాస్తంత ఆసక్తికరమే. 2011 నాటి అంచనాల ప్రకారమే నిధులు ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుంటున్నా.. మారిన పరిస్థితుల వల్ల అంచనా వ్యయం ఎక్కువ అవుతుందన్నది ఏపీ ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఆ మేరకు కేంద్రం ఆదుకుంటే సత్వరమే నిర్మాణం పూర్తవుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*