ఆనందో బ్రహ్మ మూవీ సమీక్షWant create site? Find Free WordPress Themes and plugins.
రేటింగ్ : 3/5
నటీ నటులు : తాప్సీ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, షకలక శంకర్, రాజీవ్ కనకాల తదితరులు
సంగీతం : కృష్ణ కుమార్
దర్శకత్వం : మహి.వి. రాఘవ్
నిర్మాత : శశి దేవిరెడ్డి, విజయ్ చిల్లా, సందీప్ రెడ్డి, సృజన్ ఎర్రబ్రోలు
పరిచయ వ్యాఖ్యాలు..
    దెయ్యం సినిమాలు గతంలో చాలానే వచ్చాయి. ఇప్పుడు వస్తున్నాయి. వాటిని చూసిచూసి జనాలకు బోర్ కొట్టింది. దెయ్యాలను చూసి జనాలు భయపడటం పాత టాపిక్. ఇప్పుడు జనాలను చూసి దెయ్యాలే భయపడతాయి. అది కొత్త లాజిక్. అదే అంశంతో ఒక ఇంటి చుట్టు అల్లిన కథనే ఈ హర్రర్ కామెడీ సినిమా. ఆనందో బ్రహ్మా. చాలా రోజుల తర్వాత హీరోయిన్ తాప్సీ తెలుగులో నటించడం ఒక ఎత్తయితే…మిగతా నటులు చాలా వరకు మెప్పించే ప్రయత్నం చేశారా లేదా..అనేది తెలుసుకుందాం. 
కథలోకి వెళితే… 
       ఎన్నారై రాము (రాజీవ్ కనకాల) తల్లిదండ్రులను కోల్పోతాడు. వారు నివాసం ఉన్న ఇళ్లు తమ వద్దే ఉంటే మాటి మాటికి వారు గుర్తుకు వస్తారని భావించాడు. ఆ జ్ఞాపకాతలతో తాను ప్రశాంతంగా ఉండలేనని భావిస్తాడు. అందుకే ఆ ఇంటిని అమ్మకానికి పెడతాడు. కానీ ఎవరూ కొనేందుకు ముందుకు రారు. ఆ ఇంట్లో రెండు కుటుంబాలకు చెందిన దెయ్యాలు నివాసముండటమే ఇందుకు కారణం. అందుకే ఇళ్లు కొనటానికి ముందుకు వచ్చినవారంతా దెయ్యాలు ఉన్నాయని వెనక్కు వెళుతుంటారు. దెయ్యాలున్నాయన్న నమ్మకాన్ని తొలగించేందుకు ఇంటిని అద్దెకివ్వాలని నిర్ణయించుకున్నాడు రాజీవ్. ఇంట్లో మూడు రోజులు ఉండి దెయ్యాలు లేవని చెప్తే కోటి రూపాయిలు ఇస్తానని ప్రకటిస్తాడు. ఇది చాలా మందిని ఆకట్టుకుంటోంది. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న సిద్ధూ (శ్రీనివాస్ రెడ్డి) ఆ ఇంట్లో ఉండేందుకు ముందుకు వస్తాడు శ్రీనివాస్ రెడ్డి. ఏటీఎమ్ ద‌గ్గ‌ర సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేసే  ఫ్లూట్ రాజు (వెన్నెల‌కిషోర్‌) కి కనిపిస్తాడు. త‌నకున్న రేచీక‌టి స‌మ‌స్య వ‌ల్ల ఓ కేసులో ఇరుక్కుంటాడు. అతనికి డబ్బు చాలా అవసరమవుతోంది. ఇక ఎప్పుడూ తాగే తుల‌సి (తాగుబోతు ర‌మేష్‌)కి ఇంట్లో స‌మ‌స్య‌లు ఎదురవుతాయి. ఇదే సమయంలో బాబు (ష‌క‌ల‌క శంక‌ర్‌) సినిమా పిచ్చితో త‌న షాప్ అమ్మేసి ఇబ్బందుల్లో పడ‌తాడు. ఇలా ఒకొక్క‌రిదీ ఒక్కో స‌మ‌స్య‌. వారందరికీ డ‌బ్బు అవసరం ఉంటోంది. ఈ ద‌శ‌లోనే సిద్ధుకి రాము పరిచయం అవుతాడు. తన సమస్యను తీరిస్తే కోటి రూపాయలను ఇస్తానని ఒప్పందం చేసుకుంటాడు. తన తోపాటు వచ్చిన ముగ్గురికి తలా పది లక్షల రూపాయలు ఇచ్చేందుకు సిద్దూ ఒప్పందం చేసుకుంటాడు. వారు అసలు అలాంటి ఇంట్లో ఉండేందుకు ఎందుకు ఒప్పుకున్నారు.. ఆ ఇంట్లో ఉంటున్న దెయ్యాలు ఏం చేశాయి. వారు ఎలా బెదిరిపోయారు..దెయ్యాలు ఎలా బెదిరిపోయాయనేది.
 
అసలు కథ, నటన తీరు… 
     అందాల భామ తాప్సీ లుక్ బాగుంది. తెలుగులో తిరిగి నటించినప్పటికీ ఆకట్టుకునే స్థాయిలో ఆమె పాత్ర లేదు. పర్వాలేదనిపిస్తోంది. రాజీవ్ కనకాల మరోసారి పాత్రలో లీనమై పోయి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆయనకు మంచి మార్కులు వేయవచ్చు. నటుడు కావాలనుకొని ఆస్తులు అమ్ముకున్న షకలక శంకర్ బాగానే చేశాడు. శంకర్ చేసిన కామెడీ…ధియేటర్ కు వచ్చిన అందరినీ నవ్విస్తుంది. తాగుబోతుగా రమేష్ ఎప్పటిలానే తనదైనా మార్క్ చూపించాడు. ఇక శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్ లు సరైన టైమ్ లో పంచ్ లు విసిరి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 
                   మహి.వి. రాఘవ్ దర్శకుడిగా మరోసారి తన మార్కును ప్రదర్శించాడనే చెప్పాలి. పాఠశాల సినిమాతో బాగానే ఆకట్టుకున్న రాఘవ్ ఈ మూవీతోను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కాకపోతే దెయ్యాలు మనుషులకు భయపడటం, అవి కనపడకపోయినా.. భయపడినట్లు చెప్పడం కాస్తంత విచిత్రంగా అనిపిస్తోంది. కాకపోతే హర్రర్ కామెడీ కావడంతో పర్వాలేదనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ చాలా బాగుంది. విసుగుపుట్టిస్తున్న దశలో కామెడీ సీన్స్ వారి నిద్రను పోగొడతాయి. క్లైమాక్స్ అనుకునేలా లేదు. ఏదో చేశామంటే చేశామన్నట్లుగా ఉంది. సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా అందించారు సంగీత దర్శకుడు కృష్ణ కుమార్. కామెడీ సన్నివేశాల్లోనూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో మ్యూజిక్ తోను జనం భయపడతారు. కామెడీ సీన్స్ లోను అంతే. ఈ మూవీ సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగానే ఉన్నా… ఇంకాస్త రిచ్ గా ఉంటే బావుండేదనిపించింది.
కాసేపు నవ్వుకోవడానికి ఈ సినిమా చూడవచ్చు. 
ప్లస్ పాయింట్స్…
మంచి స్క్రీన్ ప్లే
ఆకట్టుకున్న నటన
ఆసక్తికరంగా సాగిన హర్రర్ కామెడీ
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్..
సరిగా లేని ముగింపు 
విసుగుపుట్టించే దృశ్యాలు 
సెకాండఫ్ ఫస్ట్ లో బోరింగ్
లాజిక్ కు అందని కథ
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*