నంద్యాలకు తెలంగాణ డబ్బులు



Want create site? Find Free WordPress Themes and plugins.
నంద్యాల ఉప ఎన్నికపై సి.ఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఆరా తీయడం ఇప్పుడు హాట్ టాపికైంది. గవర్నర్ ఇచ్చిన తేనేటి విందుకు హాజరైన సి.ఎం కేసీఆర్, మరోవైపు ఏపీ సి.ఎం చంద్రబాబునాయుడుతో మాట్లాడారు. నంద్యాల ఉపఎన్నికల్లో గెలుపు ఎవరిదనే అంశంపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది. అదే సమయంలో గవర్నర్ నరసింహన్ వారిద్దరికి చాలా విషయాలు వాస్తవ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేయడం ఆసక్తికరంగా మారింది. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం తెలంగాణ సి.ఎం కేసీఆర్ రూ.70 కోట్లు పంపించారనే పుకార్లు వచ్చాయి. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కుమారుడు మిధున్ రెడ్డి ద్వారా ఈ డబ్బులను అందించారనే ఆరోపణలు వచ్చాయి. పెద్దిరెడ్డి, కేసీఆర్ కుటుంబాలకు బాగానే సంబంధాలున్నాయి. తెలంగాణలో కొన్ని కాంట్రాక్టులను పెద్దిరెడ్డి వర్గీయులు చేస్తున్నారు. దీంతో ఆయన ద్వారా డబ్బులు పంపించారనే వాదన సాగుతోంది. కానీ ఇది నిజం కాదంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. 
                       నంద్యాల ఉప ఎన్నికలకు మాకు సంబంధం లేదు. ఎందుకు వారికి డబ్బులు పంపిస్తామనేది వారి ప్రశ్నగా ఉంది. ఇదే సమయంలో నంద్యాల ఉప ఎన్నికల్లో రూ.400 కోట్ల వరకు ఖర్చు వస్తుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కడప ఉప ఎన్నికల సమయంలోను ఇంతగా డబ్బులు పెట్టలేదంటున్నారు. గెలుపును ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే ఇందుకు కారణమనే చర్చ జరుగుతోంది. డబ్బులు పంచడమే కాదు..వారితో ఒట్టు వేయించుకోవడం ఇప్పుడు ఉత్కంఠను పెంచుతోంది. ప్రజల సెంటిమెంట్ ను ఆసరా చేసుకుని..వారితో ఆన వేయించడం మంచి సంప్రదాయం కాదనే వాదనుంది. అయినా ఎవరు వెనక్కు తగ్గడం లేదంటున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*