సాహో హీరోయిన్ ఆమెనే…



Want create site? Find Free WordPress Themes and plugins.
బాహుబలి తర్వాత హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం సాహో. బాహుబలి-2 సినిమా విడుదలతో పాటు సాహో టీజర్ ను అభిమానులకు చూపించారు చిత్ర నిర్మాతలు. కానీ ఇప్పటి వరకు ప్రభాష్ జోడీని ఎంపిక చేయలేదు. అనుష్కతో పాటు.. చాలమంది భామలను పరిశీలించారు. చివారాకరకు శ్రద్దాకపూర్ ను ఇందుకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాహు టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. సాహో సినిమా ప్రోమోలు, ఫోటోలకు బాగానే స్పందన వచ్చింది. అందుకే సాహో పై మంచి అంచనాలు ఉన్నాయి. ఖర్చు విషయంలోను ఎక్కడా వెనక్కు తగ్గలేదు నిర్మాతలు. 
                      కానీ ఈ సినిమా ప్రభాస్ పక్కన నటించే హీరోయిన్ ఎవరనే విషయంలో ఇంత వరకు తేల్చలేదు చిత్ర బృందం. కొండవీటి చాంతాడులా చాలా మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. కొందరు డేట్స్ కుదరదని చెప్పగా.. ఇంకొంత మంది రెమ్యూనరేషన్ విషయంలో వెనక్కు తగ్గారట. చివరకు అనుష్కను పెట్టేశారనే చర్చ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ వార్త నిజం కాదు. అనుష్క స్థానంలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ ను లీడ్ గా తీసుకోవాలనుకున్నారని తెలుస్తోంది. ఆ అందాల సుందరికి ఏకంగా రూ.8 కోట్ల పారితోషికం ఇవ్వనున్నారట. ఈ సినిమాను మూడు భాషల్లో విడుదల చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఇప్పటికే సాహో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ పార్ట్ ఎక్కువ భాగం ముంబై, దుబాయిలలో చిత్రీకరించనుండటం విశేషం. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*