డల్లాస్ లో బతుకమ్మ, దసరా 2017 సంబరాలకు భారీ మద్దతుWant create site? Find Free WordPress Themes and plugins.
అమెరికాలో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ (TPAD) నిర్వహించనున్న బతుకమ్మ, దసరా సంబరాలకు భారీ మద్దతు లభించింది. డల్లాస్ పోర్టు వర్త్ కమ్యూనిటీ నేతలు, పలు జాతీయ, స్థానిక సంస్థలు, వ్యాపారులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, వ్యక్తులు పూర్తి స్థాయిలో సంబరాల నిర్వహణలో మేము సైతం అంటూ ముందుకు కదిలారు. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ అధికారికంగా సంబరాలు జరిగే తేదిలను ప్రకటించింది. టెక్సాస్ లోని ఫిస్కో డాక్టర్ పెప్పర్ అరీనాలో సెప్టెంబర్ 30, 2017న జరిగే మహా బతుకమ్మ, దసరా సంబరాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఆ రోజు అర్థరాత్రి వరకు జరిగే సంబరాలకు విచ్చేసే వారికి అనేక వసతి, సౌకర్యాలు కల్పించనున్నారు. డాక్టర్ పెప్పర్ అరీనాలో జరిగే ఉత్సవాలకు హాజరయ్యే కుటుంబాలకు భద్రతతో పాటు..వాతావరణ పరిస్థితులు అనుకూలించే చర్యలు తీసుకోనున్నారు. ఈ మహా సంబరాలకు 10 వేల మందికి పైగా హాజరయ్యే అవకాశముంది.
            దీనికి ముందుగా జరిగిన భారీ విందుకు టీపాడ్, డల్లాస్, పోర్టు వర్క్ తెలుగు సంఘం, వివిధ సంస్థల సభ్యులు, శ్రేయోభిలాషులు, ఔత్సాహికులు హాజరయ్యారు. గ్రాండ్ వెల్ కమ్ పార్టీకి హాజరైన వారికి అధ్యక్షుడు కరణ్ రెడ్డి అభినందించారు. ఈ పార్టీకి హాజరై తమ ప్రతిభను చూపిన కళాకారులు, ప్రఖ్యాతగాయకులు, నృత్యకారులు, ప్రముఖులను అభినందించడమే కాదు…దీపాలను వెలిగించి వారిలో ఉత్సాహం రగిలించారు. దీపాలను వెలిగించిన వారిలో ఇంతకు ముందు పార్లమెంటు సభ్యులైన  ఉన్న ఆత్మశరణ్ రెడ్డి, డాక్టర్ శ్రీధర్ కొరసపాటి, కృష్ణా రెడ్డి (టాంటెక్స్ అధ్యక్షుడు), డాక్టర్ నరసింహ రెడ్డి ఉరిమిండి, శ్రీకాంత్ పోలవరపు తదితరులు ఉన్నారు.
                    తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆప్ డల్లాస్ అధ్యక్షుడు కరణ్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను పరిచయం చేశారు. బతుకమ్మ, దసరా సంబరాలను వైభవంగా జరిపేందుకు సిద్దమైన కార్యదర్శి రమణ లష్కర్, సహాయ కార్యదర్శి చంద్ర పోలీస్, ట్రెజరర్ లింగారెడ్డి అల్వ, సహాయ ట్రెజరర్ రవికాంత్ మామిడి, సుధాకర్ కలసాని, సురేందర్ చింతల, శ్రీనివాస్ వేముల, శ్రీని గంగాధర, సత్య పెరికరి, శరత్ ఎర్రం, రూప.కె, రోజా అడెపు, సతీష్ జనుముపల్లితో పాటు…టీపాడ్ సమన్వయ కర్త మాధవి సుంకిరెడ్డి తదితరులను సభకు పరిచయం చేసి వారి సేవలను గుర్తు చేశారు కరణ్ రెడ్డి.
                  2017 బతుకమ్మ, దసరా సంబరాల ప్రణాళిక డిజైన్ ను టీపాడ్ గవర్నింగ్ బాడీ సభ్యులు, శారద సింగిరెడ్డి, ఆత్మచరణ్ రెడ్డిలు ఆవిష్కరించారు. ఆ తర్వాత అశోక్ కొండల బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు మనోహర్ కాసగాని (ఉపాధ్యక్షుడు) మాధవి సుంకిరెడ్డి (కో-ఆర్డనేటర్ ) రామ్ అన్నాడి, పవన్ గంగాధర, ఇందు పి. ప్రవీణ్ బిల్లా, రాజేందర్ తొడిగల వంటి వారిని సభకు పరిచయం చేశారు. ఫాండేషన్ కమిటీ ఛైర్మన్ ఉపేంద్ర తెలుగు, వైస్ ఛైర్మన్ మహేందర్ కామిరెడ్డి, సభ్యులు అజయ్ రెడ్డి, రఘవీర్ బండారు, రావు కాల్వల, జానకి మందడి, రాజ్ గొంది వంటి వారి గురించి ప్రస్తావించారు నిర్వాహకులు.
               మరోవైపు రావు కల్వల టీపాడ్ సలహాదార్లు వేణు భాగ్యనగర్, విక్రమ్ జంగం, సంతోష్ కోరి, నరేష్ సుంకిరెడ్డి, జయ తెలకలపల్లి, మాధవి లోకిరెడ్డి, సతీష్ నాగెళ్ల, గంగ దేవర, అరవింద్ రెడ్డి ముప్పాడిలు సభకు పరిచయం చేసి వారి సేవలను కొనియాడారు. మరోవైపు మనోహర్ కాసజ్ఞాని కొలాబరేషన్ కమిటీ సభ్యులైన అఖిల్ సి. సునీల్ కుమార్ ఆకుల, లక్ష్మీ పోరెడ్డి, కల్యాణి టి, మధుమతి వి.  కారుణ్య దామల, క్రాంతి తేజ పండా, పల్లవి తోటకూర, రత్న ఉప్పల, రోహిత్ నారిమేటి, శంకర్ పరిమల్, మాధవి ఓంకార్, అనుషా వనం, దీప్తి సూర్యదేవర, అపర్ణ సింగిరెడ్డి, కామేశ్వరి దివాకర్ల, కవిత బ్రహ్మదేవర వంటి వారిని పరిచయం చేసి వారి విధులను గుర్తు చేశారు.
                అజయ్ రెడ్డి, రఘవీర్ బండారు, మనోహర్ కే,  ఉపేందర్ తెలుగు, అశోక్ కొండల, రామ్ అన్నాడి వంటి వారు ఈ భారీ కార్యక్రమానికి అవసరమైన వస్తువులు తదితరాలను అందించనున్నారు. అమెరికాలోనే పెద్ద ఎత్తున జరిగే బతుకమ్మ, దసరా సంబరాల నిర్వహణకు దాతలు ముందుకు వస్తున్నారు. ఇందుకు అవసరమయ్యే $245,000.00 నిధులను ఇచ్చేందుకు సభ్యులు తమ వంతుగా హామీలిచ్చారు. వారే కాదు…అమెరికాలో ఉంటున్న అనేక తెలుగు సంఘాలైన  ATA, NATA, TATA, TANA, NATS, ATA (Telangana) మరియు స్థానిక సంస్థలైన TANTEX, IANT, TEA, MANABADI, TEA లు తమ వంతుగా ఈ మహా సంబరాలకు నిధులను ఇచ్చేందుకు సిద్దమయ్యాయి. ఇప్పటికే కొన్ని ప్రకటించాయి. తమ సంపూర్ణ మద్దతు ఇందుకు ఉంటుందని చెప్పాయి. TPAD Foundation, BOT ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఈ మహా సంబరాలను జరిపేందుకు సిద్దమైన, మద్దతు ఇచ్చేందుకు సహకరిస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు. వారి సహకారం, సలహాలు సూచనలతో బతుకమ్మ, దసరా సంబరాలు వైభవం జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*