కేవీపీ సవాల్ కు వెనక్కు తగ్గిన దేవినేని



Want create site? Find Free WordPress Themes and plugins.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు విసిరిన సవాల్ ను స్వీకరించలేదు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి విపక్షాలు అడ్డుపడుతున్నాయని దేవినేని ఆరోపించారు. ఇందుకు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఇందుకు కేవీపీ ధీటుగానే స్పందించాడు. తాము అడ్డుపడుతున్నట్లు నిరూపించినా, వచ్చే ఏడాది మార్చి లోగా పోలవరం నిర్మించినా తాను రాజ్యసభకు రాజీనామా చేస్తానన్నారు కేవీపీ. అంతే కాదు.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేవీపీ సవాల్ చేశారు. మంత్రి దేవినేని దానికి సూటిగా సమాధానం ఇవ్వలేదు. 
              కేవీపీ రాజకీయ సన్యాసంతో రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదన్నారు. అంతే తాను అన్న మాటలకు విలువలేదన్న రీతిలో వ్యవహరించారు దేవినేని. మాట అనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. అన్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. ఇప్పుడు దేవినేని వాటికి కట్టుబడి లేకపోవడం రాజకీయాల్లో మాములు విషయమే. కాంగ్రెస్ హయాంలో పోలవరం పూర్తిచేస్తే సన్మానం చేస్తామని చంద్రబాబు అప్పుడే చెప్పారని గుర్తు చేశారు దేవినేని. నీతి ఆయోగ్ సిఫారస్ మేరకు కేంద్రం ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించిందని దేవినేని అన్నారు. మసూద్‌ కమిటీ నివేదికపై వచ్చిన వార్తలు వాస్తవం కాదని తేల్చి చెప్పిన దేవినేని మరోవైపు దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల్ని సందర్శించేందుకు పార్లమెంటరీ కమిటీ వస్తోందని చెప్పారు. 
     గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన సవాల్ కు గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించానుకున్నా.. ఆ తర్వాత వెనక్కు తగ్గారు. ఇప్పుడు దేవినేని అంతే. టీడీపీలో చంద్రబాబు తప్ప గట్టిగా కౌంటర్ ఇచ్చే వారు లేకపోవడం కాస్తంత లోటేనని చెప్పాలి. అంతా వన్ మ్యాన్ ఆర్మీలా చంద్రబాబు పని చేసుకుంటు వెళుతున్నారు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*