కాంగ్రెస్ పగ్గాలు ప్రియాంకకు అప్పగిస్తారా…



Want create site? Find Free WordPress Themes and plugins.
ప్రియాంక గాంధీలో ఇందిరాగాంధీ పోలికలు ఉన్నాయి. వ్యవహారశైలిలో అలా ఉన్నారా లేరా అనే సంగతి పక్కన పెడితే ఇప్పుడు బరువైన బాధ్యతలను ప్రియాకకు అప్పగించే ఆలోచన చేస్తున్నారట సోనియాగాంధీ. తమ రాజకీయ వారసుడిగా రాహుల్ గాంధీని ప్రకటించాలని ఆలోచించినా.. ఎందుకో కాస్త తటపటాయిస్తున్నాడట రాహుల్.అందుకే ప్రియాంకుకు పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే విషయం పై హస్తం పార్టీలో సమాలోచనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ అధినేత్రి పదవి నుంచి సోనియాగాంధీ తప్పుకోనున్నారని సమాచారం. అందుకే ఆమె వారసులుగా రాహుల్ కు బదులు కుమార్తె ప్రియాంక వాద్రానాను తీసుకువచ్చే ఆలోచన చేస్తోంది. కాంగ్రెస్‌ నేతల్లో ఇప్పుడు అదే అంశం చర్చనీయాంశమైంది. పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పార్టీకి అన్నీ తానై వ్యవహరించాడు. పేరుకు సోనియాగాంధీ ఉన్నా.. రాహుల్ గాంధీ పావులు కదిపాడు. కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ ఇప్పుడు రాహుల్‌ గాంధీ కంటే కొత్త తరం పేరు వస్తేనే విజయావకాశాలు బాగుంటాయని ఆలోచిస్తున్నారట కాంగ్రెస్ నేతలు. అందుకే తాజాగా రాహుల్ కంటే ప్రియాంక పేరును తెరపైకి తెస్తున్నారు. 
      కాంగ్రెస్‌ వర్కింట్‌ కమిటీ సమావేశంలో ప్రియాంకకు బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే అంశంపై సోనియాగాంధీ ప్రస్తావించారంటున్నారు. త్వరలోనే ఈ అంశం పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అంతే కాదు… 2019 ఎన్నికలను ప్రియాంకా గాంధీనే లీడ్ చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ఎప్పుడు ఒకే కుటుంబం చేయాలా.. కొత్త వారికి అవకాశం ఇవ్వరా అనే చర్చ సాగుతోంది. ఎవరు ఎన్ని చెప్పినా నెహ్రు కుటుంబం నుంచి పగ్గాలు మరో వ్యక్తికి అంత తేలికగా ఇచ్చే వీలు లేదంటున్నారు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*