వెనక్కు తగ్గిన గద్దర్



Want create site? Find Free WordPress Themes and plugins.
ప్రజా యుద్ద నౌక గద్దర్ ముందే చేతులెత్తేశాడు. రాజకీయాలు చేయడం తన వల్ల కాదన్నాడు. పార్టీ ఏర్పాటు అంత తేలిక కాదని గ్రహించాడు. అందుకే పార్టీ పెట్టే ఆలోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించాడు. వయసు మీద పడటం, ఆరోగ్యం గతంలో సహకరించక పోవడమే ఇందుకు కారణమంటున్నారు. అంతే కాదు… పార్టీ ఏర్పాటు అంటే ఆర్థిక వనరులతో కూడుకున్న వ్యవహారం. వందలకోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అంత పెట్టే పరిస్థితుల్లో గద్దర్ లేడు. మరోవైపు తనతో కలిసి వచ్చే వారంతే పేద, బడుగు, బలహీన వర్గాలే. అందుకే పార్టీ ఏర్పాటు ఆలోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించాడాయన. 
      కానీ తెలంగాణ సర్కారు పాలనలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని చెప్పాడు. అందుకే సామాజిక ఉద్యమాన్ని తీసుకువస్తామని.. అందరినీ కలుపుకుపోతానని ప్రకటించాడు. ఇదేంటి. ఇంత హఠాత్తుగా గద్దర్ వెనక్కు తగ్గాడనే చర్చ సాగుతోందిప్పుడు. ప్రజా సంఘాలు, సామాజిక వర్గాలన్నింటినీ ఏకం చేయడమే కాకుండా కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరు బాట సాగించడమే తమ ముందున్న కర్తవ్యమని చెబుతున్నారాయన. జనసేనతో తమ పార్టీ కలిసి పోరాటం చేసేందుకు రెడీ అన్నారు. అసలు గద్దర్ ను కలిసేందుకు పవన్ మొగ్గు చూపక పోవడం ఆశ్చర్యమే. ఇంకోవైపు అన్నల నుంచి వచ్చిన సమాచారం మేరకు గద్దర్ పార్టీ పెట్టే ఆలోచనను విరమించుకున్నారనే వాదన లేకపోలేదు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*