టీడీపీని జగన్ గెలిపిస్తాడన్న వేణుమాధవ్



Want create site? Find Free WordPress Themes and plugins.
అదేంటి. కాస్తంత వింతగా ఉందీ వార్త. టీడీపీని విపక్ష నేత జగన్ గెలిపించడమేంటి అనుకుంటున్నారా. అవును. నిజమేనంటున్నాడు ప్రముఖ కమెడియిన్, టీడీపీ నేత వేణు మాధవ్. ఇందుకు మంచి లాజిక్ చెప్పాడు వేణు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారానికి రావాల్సిన పనిలేదట. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగనే సీఎం తరపున ప్రచారం చేస్తున్నారని చెప్పారు. టీడీపీ నేత, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్‌తో కలిసి నంద్యాలలో ప్రచారం చేశాడాయన. ఈ సందర్భంగా వేణు మాధవ్ ఆసక్తికర విషయాలు చెప్పాడు. నిత్యం వైఎస్ జగన్ పదేపదే చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావిస్తున్నాడు. తనకి తెలియకుండానే చంద్రబాబు తరపున ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అందుకే చంద్రబాబు పార్టీ టీడీపీ అక్కడ గెలుస్తుందన్నారు. ఒకరోజు కాల్చి పారేయాలని.. మరో రోజు ఉరి తీయాలని.. ఇంకోరోజు కాలర్ పట్టుకోవాలని చెప్పడం వైసీపీలో ఉన్న అసహనాన్ని తెరపైకి తెస్తుందన్నారు. అందుకే జగన్ నోటి చలవతోనే టీడీపీకి మరింత విజయం చేకూరుతుందన్నారు వేణు మాధవ్. జగన్ టీడీపీ తరపున అంతగా ప్రచారం చేస్తున్నప్పుడు ఇక సీఎం చంద్రబాబుకి ఎన్నికల ప్రచారానికి రావాల్సిన అవసరం ఏముంటుందని కమెడియన్ ప్రశ్నగా ఉంది. తాను ప్రచారం కోసం నంద్యాల రాలేదని, టీడీపీ తరపున పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానంద రెడ్డికి ఎంత మెజార్టీ వస్తుందో ఓసారి చూద్దామనే ఉద్దేశంతోనే వచ్చానని చెప్పారు వేణుమాధవ్. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*