టీడీపీ వైపే చూస్తున్న నంద్యాల పట్టణ ఓటర్లు…



Want create site? Find Free WordPress Themes and plugins.
       నంద్యాల పట్టణ ఓటర్ల పై వైసీపీ ఆశలు వదులుకున్నట్లే అంటున్నారు. పట్టణం కంటే గ్రామాల్లో వైసీపీకి మంచి పట్టుంది. టీడీపీ కంటే వైసీపీకే అక్కడ ఓట్లు బాగా పడే అవకాశముంది. ఇటీవల టీడీపీ చేయించిన ప్రైవేటు సర్వేలోను అదే రిపోర్టు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ నంద్యాలలో కాపు, ముస్లిం, వైశ్యుల ఓట్లు కీలకం. వారు ఎటువైపు మొగ్గు చూపితే వారిదే విజయం. ఇప్పుడు ఆ నేతలంతా టీడీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని తమ ప్రాంతాలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా బొగ్గులైను, నూనేపల్లి, మాల్ దార్ పేట, బొమ్మల సత్రం, ఎంఎస్ నగర్, జ్ఞానపురం, విశ్వాసపురం, డేనియల్ పురం, బొంతలవీధి, ఎస్సీ కాలనీ, పోలీస్ స్టేషన్ బజార్ లలో ఓటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సి.ఎం చంద్రబాబునాయుడును చంపాలి, ఉరితీయాలి, కాలర్ పట్టుకుని నిలదీయాలి వంటిపదాలతో విపక్ష నేత జగన్ విరుచుకుపడుతున్నారు. అదే సమయంలో టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలని సిఎం చంద్రబాబునాయుడు చెప్పడం కలిసొస్తోంది. 
       డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో వైసీపీ కంటే టీడీపీనే ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందంటున్నారు. ఫలితంగా డబ్బులు బయటకు తీసేందుకు కాస్తంత తటపటాయిస్తున్నారట. అదే జరిగితే ఓటమి ఖాయం. ఈ ఎన్నికల్లో టీడీపీకి సమానంగా డబ్బులు ఖర్చు పెడితేనే విజయం అంచుల వరకు వెళతారు..కానీ ఆ పరిస్థితి లేదని తేలిపోవడం వారిని నిరాశకు గురి చేస్తోంది. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని పీకే ఇప్పటికే చెప్పేశారట. అందుకే ఆయన ఢిల్లీకి పరిమితమయ్యారని తెలుస్తోంది. ఇంకోవైపు నంద్యాలలో ఉండేందుకు జగన్ ఇప్పుడు అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఒక విపక్ష నేత అన్ని రోజుల పాటు ఉప ఎన్నికల కోసం ఒక నియోజకవర్గంలో మకాం వేయడం గతంలో ఎప్పుడు జరగలేదు. ఇంత చేసినా ఫలితం దక్కుతుందా అంటే నిరాశేనంటున్నారు. మనం చాలా కష్టపడ్డాం. గెలుపు అనేది దైవాదీనమని చెబుతున్నారట జగన్.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*