నంద్యాలలో టీడీపీకి 10-20 వేల ఓట్లతో మెజార్టీ



Want create site? Find Free WordPress Themes and plugins.
నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ 10-20 వేల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ నిర్వహించిన సర్వేలోనే తేలినట్లు సమాచారం. సర్వే ఫలితాలు వచ్చాక మరింతగా వైసీపీ శ్రేణులు ఢీలా పడ్డాయనే ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన శిల్పా చక్రపాణిరెడ్డి ఇప్పుడు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. అసలు ఎందుకు వచ్చానురా బాబోయ్ అంటూ తల బాదుకుంటున్నాడట. హాయిగా రెండోసారి ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. తమ్ముడి కోసం వాటన్నింటిని కాదనుకుని వచ్చా. కానీ ఇక్కడ సీన్ రివర్స్ గా ఉందంటున్నాడట. అంతే కాదు.. బంధువులు, ఎన్నారైలు అంత తొందరపడి ఎందుకు జగన్ పార్టీలో చేరావని తిడుతున్నారట. వారి మాటలకు అసహనం పెరిగి శిల్పా తన ఇంట్లో ఉన్న టీవీని పగులగొట్టారని తెలుస్తోంది. అంతే కాదు.. తమ్ముడి మీద ఇంతెత్తున లేస్తున్నారని అనుచరులు చెప్పుకుంటున్న మాట. రాజకీయంగా తమ గోతి తామే తీసుకున్నామని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
                మరోవైపు జగన్ అన్ని రోజులు అక్కడ ఉండటంతో ఖర్చు తడిసి మోపెడవుతుందట. మైనార్టీలంతా టీడీపీ వైపు మొగ్గు చూపడం వైసీపీని ఆందోళనకు గురి చేస్తున్న అంశం. నంద్యాల కూరగాయల మార్కెట్ కమిటీ ఛైర్మన్ కరీం. విద్యా సంస్థల అధినేత ఇంతియాజ్, మాజీ మంత్రి ఫరూక్ లు మైనార్టీలను ఏక తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు, నంది పైప్స్ సిఎండి శ్రీధర్ రెడ్డికి మైనార్టీల్లో మంచి పేరే ఉంది. అందుకే వారిని తమ వైపు తిప్పేందుకు తమ వంతుగా పావులు కదిపారంటున్నారు. ఇంకోవైపు బీజేపీ టీడీపీకి మద్దతు పలికినా… పార్టీ జెండాలతో వచ్చి ప్రచారం చేయడంలేదు. అది టీడీపీకి మరింతగా కలిసి వచ్చే అంశం. బీజేపీని గట్టిగా తిట్టే పరిస్థితుల్లో వైసీపీలేదు. అందుకే ఏం అనలేక అలాయని ఊరుకోలేక తల్లడిల్లుతోంది. 
                వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఆరోగ్యం బాగోలేదని చెబుతున్నారు అనుచరులు. శిల్పాకు పైల్స్ ఏర్పడ్డాయి. ఫలితంగా ఎక్కువ సేపు కూర్చోలేక.. అలాయని నిలుచులేక తల్లడిల్లుతున్నాడట. అందుకే ఈ మధ్య రెండు రోజుల పాటు ఇంట్లో ఉన్నారంటున్నారు. అప్పుడే బంధువులంతా వచ్చి శిల్పాను తిట్టారని చెబుతున్నారు. మైనార్టీల్లో మెజార్టీ ఓటర్లు టీడీపీకి మొగ్గు చూపితే టీడీపీ విజయం ఖాయమంటున్నారు. కచ్చితంగా టీడీపీకి 10 వేలకు పైగా మెజార్టీ వస్తుందని చెబుతున్నారు ఏ పార్టీకి సంబంధం లేని ఓటర్లు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*