ఏపీలో పీకే జెండా పీకేసినట్లేనా…



Want create site? Find Free WordPress Themes and plugins.
ప్రశాంత్ కిషోర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎన్నికల వ్యూహకర్త. గుంటూరులో జరిగిన పార్టీ సభలో ఆయన్ను కార్యకర్తలకు పరిచయం చేశారు వైకాపా అధినేత జగన్. ఈయనే పీకే. గతంలో ఎన్నికల్లో చాలా బాగా వ్యూహ రచన చేశాడని చెప్పారు. బీహార్ లో కూటమి విజయం సాధించడానికి పీకేనే కారణమన్నాడు. నరేంద్ర మోడీ  ప్రధాని అయ్యేందుకు ఆయన సలహాలు సూచనలు ఇచ్చారని గట్టిగానే చెప్పారు. కానీ నంద్యాల ఉపఎన్నికల సమయంలో పీకే ఎక్కడకు వెళ్లాడో అర్థం కావడంలేదంటున్నారు ఆపార్టీకి చెందిన నేతలు. జగన్ కు పీకే మధ్య వ్యవహరం చెడిందా లేక మరో కారణం ఉందా అనే కోణంలో చర్చ సాగుతోంది. 
                    పీకే ప్రస్తుతం హస్తినలో ఉంటున్నాడు. మరోవైపు తమిళనాడులో డిఎంకే గెలిచేందుకు ఆయన కసరత్తులు చేస్తున్నాడు. నంద్యాల ఎన్నికల్లో పీకే చెప్పినట్లుగా జగన్ నడుచుకోలేదని.. అందుకే పీకే ఇటువైపు రావడం లేదనే వాదనుంది. జగన్ గురించి బాగా తెలిసిన వారెవరూ శాశ్వతంగా ఆయనతో స్నేహం చేయలేరంటారు. జగన్ ఎవరినీ అంతగా నమ్మడని.. వాడుకుని వదిలేసే రకమనే చర్చ గతంలోనే వచ్చింది. అందుకే పీకేని పక్కన పెట్టేశారని వాదనుంది. భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వారు పీకేనే ఎవరు అని ప్రశ్నించడం కాస్తంత వింతగానే ఉంది. వైసీపీ సభలో పరిచయం చేసిన వ్యక్తి గురించి తెలియకనా లేకా… కావాలనే వ్యంగ్యంగా అలా అన్నారా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వెలుగులోకి వచ్చే వీలుంది.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*