ఖమ్మంలో పైసా వసూల్ చిత్ర ఆడియో వేడుకలు



Want create site? Find Free WordPress Themes and plugins.
ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య నటించిన పైసా వసూల్ సినిమా ఆడియో వేడుకలు ఖమ్మంలో జరగనున్నాయి. ఈనెల 17న జరిగే ఆడియో వేడుకల కోసం రంగం సిద్దమవుతోంది. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ప్రారంభోత్సవాన్ని నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో చేయగా… ఈ సారి తెలంగాణకు ఆ అవకాశం కేటాయించారు బాలయ్య. అందుకే ఖమ్మం జిల్లాలో పైసా వసూల్ వేడుకలు పెట్టాలని కోరారట. నందమూరి బాలకృష్ణ, శ్రియ, ముస్కాన్, కైరాదత్ లు నటిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. పూరి జగన్నాథ్‌ ఈ సినిమాకు దర్శకుడు. భవ్య క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌ లో వి. ఆనందప్రసాద్‌ నిర్మించిన సినిమా ‘పైసా వసూల్‌’. సెప్టెంబర్‌ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ఆడియో పంక్షన్ కోసం బాలయ్య, పూరీ తదితరులు హైదరాబాద్‌ నుంచి ఖమ్మంకు హెలికాఫ్టర్‌లో వెళ్లనున్నారు. అదే రోజున సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనుండటం ఆసక్తిని పెంచుతోంది. పోర్చుగల్ లో సినిమా పార్ట్ చాలా భాగం షూటింగ్ చేసుకోవడం ఒక ఎత్తయితే.. ఓ ఫైట్ లో తన కారును 360 డిగ్రీతో తిప్పడం ఉత్కంఠను రేపింది. 
                     అంతే కాదు.. పైసా వసూల్ మూవీ స్టంపర్ అదరగొట్టింది. బాలయ్య బాబు డైలాగ్ లకు చప్పట్లు కొడుతున్నారు జనాలు. ఎప్పుడు ఇచ్చే మూవీ టీజర్, ట్రైలర్‌లకు భిన్నంగా ఉంటుందని చెప్పిన దర్శకుడు పూరీ వైరైటీగా స్టంపర్‌ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీత దర్శకుడుగా ఉండటం కలిసొచ్చే అంశం. అన్నా. రెండు బాల్కనీ టిక్కెట్లు కావాలి. ఆ… ఇది సినిమా కాదువోయ్. సినిమా కాకపోతే ఇంకేంటి. ఐయామ్ ది హీరో. యువర్ ది కమెడియన్. విలన్ టచ్ డ్ బై హీరో ఈజ్. దిస్ ఈజ్ ఏ యాక్షన్ ఫిల్మ్. తమ్ముడూ నేను జంగిల్ బుక్ సినిమా చూడలా. కానీ అందులో పులి నాలాగా ఉంటుందని చాలా మంది చెప్పారు. అది నిజమే కాదో మీరే చెప్పాలి అంటూ సాగే డైలాగ్స్ అదరగొట్టాయి. పాటలు, పైటింగ్స్, డైలాగులు చాలా బాగున్నాయి. అందుకే ఇప్పుడు ఆడియో ఫంక్షన్ పైనా ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*