కరీం చేరిక శిల్పాకు దెబ్బేనంటున్న మైనార్టీలు



Want create site? Find Free WordPress Themes and plugins.
నంద్యాల కూరగాయల మార్కెట్ కమిటీ ఛైర్మన్ కరీం. మైనార్టీల్లో ఆయనకు మంచి పేరుంది. అందరితోను పరిచయాలున్నాయి. 60 వేల మంది మైనార్టీ ఓట్లు నంద్యాలలో కీలకంగా మారాయి. ఇప్పటికే  ప్రైవేటు విద్యా సంస్థల ఛైర్మన్, జి ఇంతియాజ్, నంద్యాల మున్సిపల్ మాజీ చైర్మన్, దివంగత సి.ఎం వైఎస్ అనుచరుడు నౌమాన్ లు టీడీపీలో చేరారు. ఉర్దూ అకాడమి ఛైర్మన్ గా ఆయన్ను నియమించారు సి.ఎం చంద్రబాబునాయుడు. మరోవైపు మాజీ మంత్రి ఫరూక్ కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. అంతటితో ఆగలేదు. ఫరూక్ కు శాసనమండలి ఛైర్మన్ సీటును అప్పగించేందుకు సిద్దమనే సంకేతాలిచ్చారు చంద్రబాబు. శాసనమండలి ఛైర్మన్ గా ఉన్న చక్రపాణి పదవి కాలం పూర్తయిన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన స్థానంలో అదే జిల్లాకు చెందిన టీడీపీ నేతకు అందులోను మైనార్టీలకు పదవి రావడం అక్కడి వారిని ఆకట్టుకుంటోంది. 
          ఇప్పుడు నంద్యాల కూరగాయల మార్కెట్ కమిటీ ఛైర్మన్ కరీం టీడీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు కరీం. నంది పైప్స్ అధినేత శ్రీధర్ రెడ్డి ఆయన చేరికలో తన వంతు పాత్ర నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గెలుపు ఆశలు సన్నగిల్లడంతో శిల్పా ఖర్చుకు వెనక్కు తగ్గుతున్నట్లు సమాచారం. మరోవైపు రోజుకో వికెట్ చొప్పున నేతలంతా టీడీపీ వైపు వెళ్లడం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేసే అంశమే. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*