దీక్షా రాజకీయాలు…



Want create site? Find Free WordPress Themes and plugins.
       తెలుగు రాష్ట్రాల్లో తిరిగి దీక్షా రాజకీయాలు పుంజుకున్నాయి. మొన్ననే కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆమరణదీక్ష చేశారు.పరామర్శించేందుకు వెళ్లిన సిఎల్పీ నేత జానారెడ్డి ఆమరణ దీక్ష చేయవద్దని..సాధారణ దీక్ష చేయాలని సలహానిచ్చి వచ్చారు. దీంతో స్థానిక కాంగ్రెస్ నేతలు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. దీక్ష చేసినా ప్రభుత్వం స్పందించలేదు. అదే సమయంలో పొన్నంను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. కాకపోతే కాస్తంత ప్రచారం మాత్రంపొన్నంకు వచ్చింది. మెడికల్ కాలేజి ఏర్పాటు చేయాలనేది ఆయన డిమాండ్. ఇప్పుడు అలాంటి డిమాండ్ తోనే తెలంగాణ కాంగ్రెస్ నేత రంగంలోకి వచ్చారు. ఆయనే మా జీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి. ఈ నెల పదిహేడు నుంచి మెడికల్ కాలేజీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీని సిద్దిపేటకు తరలించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సంగారెడ్డికి మరో మెడికల్ కాలేజి ఏర్పాటు చేయాలనేది ఆయన డిమాండ్ గా ఉంది. సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ తేవడంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్‌ విఫలమయ్యారని ఆరోపించారు. అందుకే తాను మెడికల్‌ కాలేజీ మంజూరుచేసేవరకు పోరాటం చేస్తానని జగ్గారెడ్డి హెచ్చరించారు.
       ఏపీలో కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ దీక్ష రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో విపక్ష నేత జగన్ ప్రతి సమస్య పరిష్కారం కోసం దీక్ష చేసేవారు. ఇప్పుడు తగ్గినా..నేతలు ఎక్కువ భాగం తమ సమస్య పరిష్కారం కోసం దీక్షలనే ఎంచుకుంటున్నారు. స్వాతంత్ర్యం పూర్వం నుంచి నేతలను ఇదే పంథాను అనుసరిస్తున్న సంగతి తెలియంది కాదు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*