ప్రశాంత కిషోర్ పై సమాచార సేకరణ



Want create site? Find Free WordPress Themes and plugins.
టీడీపీ టార్గెట్ మారింది. జగన్ తో పాటు.. పీకే పైనా తమ బాణాన్ని ఎక్కుపెట్టింది. సోషల్ మీడియా వేదికగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి చంద్రబాబును బదనాం చేసేందుకు ప్రశాంత్ కిషోర్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ముందుగా పీకే పై ఆరా తీసే పనిలో పడింది టీడీపీ. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగే సమయంలో పీకే పై ఏడు కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకటి సైబర్ కేసు ఉంది. అందుకే ఆ కేసుల పూర్వ పరాలను పరిశీలించేందుకు టీడీపీ బృందం ఒకటి యూపీ వెళ్లినట్లు తెలుస్తోంది. పీకే పై ఏం కేసులు ఉన్నాయి. వాస్తవ పరిస్థితి ఏంటి. ఆ కేసులతో పాటు.. కొత్తగా ఏపీలో కేసు పెట్టేందుకు టీడీపీ నేతలు సమాలోచనలు చేస్తున్నారట. ఈ విషయం తెలిసిన పీకే పత్తా లేకుండా పోయారనే వాదనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ఎన్నికల సలహాదారుగా ఉన్న పీకే ఇప్పుడు రూటు మార్చారు. గతంలో ఉన్న సంబంధాలు ఇప్పుడు జగన్ తో లేవంటున్నారు. అందుకే నంద్యాల ఉపఎన్నికల సమయంలో కనిపించకుండా పోయారంటున్నారు. విషయం ఏదైనా ఇప్పుడు పీకేను ఇరికించేందుకు రంగం సిద్దమవుతోంది. నకిలీ అకౌంట్ల పేరుతో టీడీపీ సర్కారు పై పోస్టులు చేయించడం సైబర్ నేరం కిందకు వస్తోంది. అందుకే పీకేను అమరావతి నగరానికి పిలిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*