కమలం అధినేత రాక కోసం 



Want create site? Find Free WordPress Themes and plugins.
        బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌షా ఈ నెల 28న విజయవాడకు రానున్నారు. మూడురోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనుండటం ఇప్పుడు ఉత్కంఠను పెంచుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక, రాబోయే కాలంలో ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి. టీడీపీతోపొత్తు పెట్టుకోవాలా వద్దా అనే అంశాల పై పార్టీ పదాదికారుల సమావేశంలో చర్చించనున్నారు అమిత్ షా. మరోవైపు వెంకయ్యనాయుడు లేని లోటును భర్తీ చేసేందుకు ఏపీలో మరో వ్యక్తిని కీలకం చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలకు ముందు హైదరాబాద్‌, విజయవాడలోను అమిత్ షా పర్యటించిన సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఏకంగా మూడు రోజులు బెజవాడలోనే మకాం వేయనుండటం పై మరోవైపు టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీకి ఆ పార్టీ మద్దతు ప్రకటించింది. కానీ జెండాలు లేకుండా ప్రచారం చేయాలని టీడీపీ షరతు పెట్టడం కాస్తంత ఇబ్బంది కరమే. మా పార్టీ మద్దతు కావాలి గానీ…జెండా వద్దని చెప్పడం ఆశ్చర్యమే అయినా మైనార్టీ ఓట్ల కోసం అది తప్పదంటున్నారు టీడీపీ లీడర్లు.
 
        దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం కోసం ముందస్తుగానే ప్రణాళిక సిద్దం చేస్తున్న బీజేపీ వ్యూహాత్మకంగానే అమిత్ షా ను ఏపీకి పంపుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో టీడీపీ జెండా కింద కమలం వాడిపోతుందని..అందుకే ఒంటరిగా పోటీ చేసే ఆలోచన చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందనే విషయం పైనా నేతలతో సమాలోచనలు చేయనున్నారు అమిత్ షా.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*