కేటీఆర్ గెలుపు పై సందేహాలు 



Want create site? Find Free WordPress Themes and plugins.
నేరెళ్ల ఘటనతో కేటీఆర్ కు ఇబ్బంది వచ్చి పడింది. సిరిసిల్లలో ఉన్న నేరెళ్లతో పాటు.. తంగళ్ల పల్లి, రామచంద్రపురం గ్రామాల ప్రజలు గతంలో కేటీఆర్‌ కు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు ఆయన పేరు ఎత్తితేనే మండిపడుతున్నారు. తనకు విజయం చేకూర్చి పెట్టిన వారిని ఆదుకునేందుకు కేటీఆర్ పెద్దగా ఆసక్తి చూపక పోవడం విమర్శలకు తావిచ్చింది. ఇసుక మాఫియాకు అడ్డు వస్తున్నారనే కారణంతో దళితులను పోలీసులు చావ బాదడం వివాదాన్ని రేపింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. అదే విపక్షాలకు వరంగా మారింది. ఇంటా బయటా విమర్శలు ఎక్కువ కావడంతో గులాబీ నేతలు దిద్దుబాటుకు దిగారు. 
                   ఇందులో భాగంగా నేరెళ్ల బాధితులతో కేటీఆర్ మంతనాలు జరిపారు. వారిని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసినా పెద్దగా కలిసి కాలేదు. అదే సమయంలో ఆ సంఘటన తనకు తెలియదని బుకాయించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సంఘటన తనకు తెలియలేదని అమాయకం చెప్పడం వారిని మరింతగా ఆగ్రహానికి గురిచేసింది. దిద్దుబాటు చర్యగా ఎస్ఐను సస్పెండ్ చేసినా..జిల్లా ఎస్పీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ తెరమీదకు వచ్చింది. 
                      సంసారానికి పనికి రాకుండా మర్మంగాల పైన లాఠీలతో కుళ్లబొడవం మాములు విషయం కాదు. కరీంనగర్ జిల్లా ఎస్పీ దగ్గరుండి మరీ ఎనిమిది మంది దళితులను చితకబాదడమే కాదు..కొట్టించారనే ఆరోపణలు వచ్చాయి. మొత్తంగా ఈ విషయం జాతీయ స్థాయిలో ప్రచారం కావడంతో తెలంగాణ సర్కారు ఇరుకున పడింది. 2014లో తన గెలుపుకు కారణమైన వారు ఇప్పుడు తన ఓటమికి పావులు కదపవచ్చని కేటీఆర్ వర్గం అంచనా వేస్తోంది. అందుకే ఇప్పుడు సిరిసిల్లను కాదని మరో స్థానానికి ఆయన్ను పంపిస్తారనే చర్చ సాగుతోంది. అదే సమయంలో కేసీఆర్ ఆత్మరక్షణలో పడటం ఆసక్తికరమే.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*