ఉల్లితో ఇబ్బంది పడకుండా చంద్రబాబు చర్యలు



Want create site? Find Free WordPress Themes and plugins.
        తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందని నానుడి. ఇప్పుడు ఉల్లి ధరలకు రెక్కలొస్తున్నాయి. రెండు వారాల కిందట వరకు రూ.50 ఇస్తే ఐదు కిలోలు ఉల్లిపాయలు వచ్చేవి. నేడు అదే రూ.50కు రెండున్నర కిలోలు వస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాటి ధర మరింతగా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అందుకే సి.ఎం చంద్రబాబునాయుడు రంగంలోకి దిగారు. రాష్ట్రంలో ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్‌ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు. ఉల్లి ధరల నియంత్రణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. వీటి ధర తగ్గే వరకూ సబ్సిడీతో రైతు బజార్లలో విక్రయించాలని సూచించడం మంచిదైంది. 
        ఉల్లి అక్రమ నిల్వలపై మార్కెటింగ్‌, సివిల్‌ సప్లై శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కావాలని ఉల్లి పాయలను గోదాముల్లో పెట్టే వారి పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా ఉల్లి ధరలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు ఉల్లి ధరల కోసం 1100 టోల్‌ ఫ్రీ నెంబరును కేటాయించారు. దానికి వచ్చే ఫిర్యాదులను బట్టి దాడులు నిర్వహించనున్నారు. అదే సమయంలో ఉల్లి కొరత నివారణకు చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. గతంలో ఉల్లి కోసం ప్రభుత్వాలే పడిపోయిన సంగతి తెలిసిందే. అందుకే చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు చంద్రబాబు. నంద్యాల ఉప ఎన్నికల వేళ విపక్షాలకు ఉల్లి ఆయుధంగా మారకూడదని చంద్రబాబు ముందే గ్రహించారంటున్నారు. అందుకే వారు డిమాండ్ చేయక ముందే చర్యలు తీసుకోవడం బాబు దూరదృష్టికి నిదర్శనమని చెప్పాలి. గతంతో పోల్చుకుంటే ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గింది. అదే సమయంలో దిగుబడులు సరిగా రాలేదు. అందుకే ఇప్పుడు మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల నుండి ఉల్లిని సేకరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రైతు బజార్లలో పూర్తిస్థాయిలో ఉల్లిపాయలు అందుబాటులో ఉండేందుకు ప్రతి 2 గంటలకోసారి సమీక్షించాలని ఆయా శాఖల అధికారుల్ని సిఎం ఆదేశించడం వాస్తవ పరిస్థితికి అద్దంపడుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*