నిధులు ఇవ్వకుండా ఏపీని ఇబ్బంది పెడుతున్న కేంద్రం



Want create site? Find Free WordPress Themes and plugins.
      నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ఘనంగానే ప్రకటించింది. విభజనలో భాగంగా అనేక కేంద్ర సంస్థలను ఏపీకి కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. చెప్పడమే కాదు..కొన్నింటిని మంజూరు చేసింది. కానీ సంస్థలైతే ఇచ్చింది. వాటి కోసం నిధులు ఇవ్వడం లేదు. ఇది ఏపీని ఆందోళనకు గురి చేస్తోంది. ఎపికి కేంద్ర ప్రభుత్వం గత మూడేళ్లలో మంజూరు చేసిన సంస్థలకు మౌలిక వసతులు కల్పించడానికి తగు నిధులు కేటాయించలేదు. దీంతో అద్దె వసతులలోనే  వాటిని నడపాల్సి వస్తోంది. అది రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారింది. కేంద్రం వాటికి దశల వారీగా నిధులు ఇస్తుందని ఆశించినా ఇంకా ఎదురుచూపుకే పరిమితం కావాల్సి వస్తోంది. 
       విశాఖలో ఐఐఎమ్, తాడేపల్లిగూడెంలో ఎన్.ఐ.టి., తిరుపతిలో సైన్స్ ఇన్ స్టిట్యూట్ , శ్రీసిటీలో త్రిబుల్ ఐటి, నెల్లూరులో ఏర్పాటుచేసిన టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్ మెంట్ సంస్థ మొదలైనవాటికి రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. ప్రాధమికంగా స్థలాల చుట్టూరా గోడలు కట్టించింది. కానీ వాటి నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రం ఇవ్వలేదు. ఫలితంగా ఏదో అరకొర వసతులతో నడుస్తున్నాయి. ఈ విషయం పై రాష్ట్రం అనేక సార్లు కేంద్రం పై ఒత్తిడి తెచ్చినా ప్రయోజనం లేకపోతోంది. కావాలని ఇవ్వడం లేదా..లేక సి.ఎం చంద్రబాబు సహనాన్ని పరీక్షిస్తున్నారా అనే చర్చ జరుగుతుందిప్పుడు. ఇదే విషయమై మంత్రి గంటా శ్రీనివాసరావును అడిగితే ఆసక్తికర సమాధానం చెప్పారు. 
       తాము కేంద్రం నుంచి నిధుల కోసం ఒత్తిడి చేస్తున్నాం. ఇంకా రాలేదనేదే ఆయన సమాధానమైంది. కేంద్ర సంస్థలు రుణాలు తీసుకోవడానికి అవకాశం ఇచ్చి, బ్యాంక్ గ్యారంటీలను కేంద్రం ఇస్తే కొంత వరకు సమస్య పరిష్కారం అవుతుందన్నారు మంత్రి గంటా. విశాఖ ఐఐఎమ్ కు రూ. 1000 కోట్లు, తాడేపల్లి గూడెం ఎన్ ఐటికి రూ. 300 కోట్లు, తిరుపతి సైన్స్ కేంద్రానికి రూ.450 కోట్లు కేటాయించింది కేంద్రం. కానీ నిధులు ఇవ్వకపోతే వాటి పనులను ఎలా చేయాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉంది. అసలే లోటు బడ్జెట్ తో ఏపీని ఇచ్చినా..ప్రత్యేక హోదాను పక్కన పడేసినా..గట్టిగా మాట్లాడలేని పరిస్థితి అయింది చంద్రబాబుది. ఇలాంటి సమయంలో ఏపీని మరింతగా ఇబ్బంది పెట్టేలా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*