బ్యాంకుల ద్వారా ఓటర్లకు డబ్బులు



Want create site? Find Free WordPress Themes and plugins.
నంద్యాల ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నాయి కొన్నిపార్టీలు. ఎలాగైనా గెలవాలి. డబ్బులు పంచాలి. నిఘా ముమ్మరం కావడంతో ఏం చేయాలా అని ఆలోచించారు. పోలీసులు, అధికార యంత్రాంగం ఎప్ప‌టిక‌ప్పుడు అప్రమత్తంగా ఉండటం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. అందుకే సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నాయి. మహిళల బ్యాంకు ఖాతాలు సేకరించి అందులో డబ్బులు వేసేందుకు సిద్దమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒక నాయకుడి ఆధీనంలో ఉన్న బ్యాంకు ద్వారా కొందరు మహిళలకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేశారంటున్నారు. ఆ బ్యాంకులో ఖాతాల్లేని వారి వివ‌రాలను సేక‌రించేందుకు ఏకంగా 23 టీంలు రంగంలోకి దిగాయంటున్నారు. ఇందుకు టీడీపీ వాళ్లు ఆధారాల‌తో స‌హా ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు. నంద్యాలలోని నందమూరినగర్‌, వై.ఎస్‌.నగర్‌, ఊడు మాల్పురం, రాజీవ్‌ గృహకల్ప, పోలీస్ స్టేషన్ రోడ్, బొమ్మల సత్రం ప్రాంతాల్లోను ఖాతాల సేకరణలో ఉన్నారు నేతలు. డబ్బు తీసుకునేందుకు ముందుకొచ్చేవారికి నగదు బదిలీ చేస్తారని తెలుస్తోంది. మరోవైపు నంద్యాల, గోస్పాడు మండలాల్లోను ఖాతాల సేకరణను వైసీపీ నేతలు చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. మాకు డబ్బులు పంచాల్సిన అవసరమే లేదంటోంది ఇంకోవైపు వైసీపీ. 
                   డబ్బులను కీలక నేతలకు ఇస్తే అసలైన వారికి చేరవనే ఆలోచనతోనే ఎవరికి వారి పేర్లు, ఖాతాలను తీసుకుంటున్నారు. కానీ ఇది ఇబ్బంది కలిగించే అంశమే. కచ్చితంగా డబ్బులు ఎవరు వేశారు. ఎందుకు వేశారు వంటి విషయాలు తెలిసే అవకాశముంది. మొత్తంగా రూ.350 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ప్రధాన పార్టీల నేతలు ముందుకు వచ్చారనే వాదన లేకపోలేదు. ఇంకోవైపు నంద్యాలలో ఎవరు గెలుస్తారనే అంశం పై అప్పుడే జోరుగా బెట్టింగ్ సాగుతోంది. వైసీపీ అధికారంలోకి వస్తుందని గతంలో కర్నూలు, కడప జిల్లాలకు చెందిన వారు పెద్ద మొత్తంలో పందెలు కాశారు. కానీ వైసీపీ నేతలే ఈ బెట్టింగ్ లో ఎక్కువగా నష్టపోయారు. ఆపార్టీ అంటే అభిమానం ఉండవచ్చు గానీ.. బెట్టింగ్ లతో మొత్తం పోగొట్టుకోవద్దంటున్నారు మిగతా వాళ్లు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*