జెండాలు లేకుండా బీజేపీ ప్రచారం



Want create site? Find Free WordPress Themes and plugins.
 
      నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. కానీ ఆ పార్టీ నేతలు తమ పార్టీ జెండాలు లేకుండానే  ప్రచారం చేయడం కాస్తంత ఆశ్చర్యమే. నంద్యాలలో 60 వేలకు పైగా ముస్లింలు ఓటర్లు ఉన్నారు. బీజేపీ ఎక్కువగా ప్రచారం చేస్తే ఆ మేరకు ముస్లిం ఓటర్లు దూరం అయ్యే వీలుంది. అందుకే వారు జెండాలతో రాకుండా పార్టీ కండువా కప్పుకుని ప్రచారానికి వస్తున్నారు. ఈ విషయం పై నంద్యాలలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు పోన్ చేసి మద్దతు కోరారని బీజేపీ అధ్యక్షుడు కంభపాటి హరిబాబు చెప్పారు. కర్నూలు జిల్లా నేతలు రాంభూపాల్ రెడ్డి, ఈశ్వరయ్యలు మాత్రం తమను జెండాలు లేకుండా రావాలని కోరారని, అందుకే అలా వెళ్లడం లేదని చెప్పారు. హరిబాబు మాట్లాడుతూ టిడిపి అలా కోరడం తప్పే అయినా, టిడిపికి సహకరించాల్సి ఉందన్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ మాదవ్ లను నంద్యాలకు పంపించాలని సమావేశంలో నిర్ణయించినా వారు పార్టీ జెండాలతో కాకుండా టీడీపీ జెండాలతో ప్రచారం చేయనుండటం ఆసక్తికరంగా మారనుంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*