అమిత్ షా ఎందుకు వస్తున్నారంటే…



Want create site? Find Free WordPress Themes and plugins.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడురోజుల పాటు ఏపీలో పర్యటించనుండటం ఆసక్తి పెంచుతోంది. నంద్యాల ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన రానుండటం ఒక ఎత్తయితే ఏకంగా మూడు రోజుల పాటు ఏపీలోనే గడపనుండటం మరో ఎత్తు. వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా వెళ్లడంతో దక్షిణాది రాష్ట్రాలను చూసుకునేందుకు కీలక నేతను ఎంపిక చేయనున్నారు. అదే సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడ్ని నియమించేందుకు అమిత్ షా పావులు కదుపుతున్నాడు. నంద్యాలలో ఆగస్టు 23న పోలింగ్‌ జరగనుండగా… బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా.. ఆగస్టు చివరి వారంలో ఏపీకి వచ్చి నేతలతో మాట్లాడనున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమంయలో టీడీపీతో అంత తేలికగా పొత్తు వదులుకునేందుకు సిద్దంగా లేదంటున్నారు.  నంద్యాల ఉప ఎన్నికల్లో బీజేపీ టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికే మద్దతు పలికింది. ప్రచారంలో పాల్గొననుంది. ఇక్కడే కాదు.. కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లోను రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని ఇప్పటికే బీజేపీ ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది. 
           ఏపీ బీజేపీ శాఖకు కొత్త నేతను ఎంపిక చేయడంతో పాటు.. రానున్న ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలనే అంశం పైనా కసరత్తు చేయనున్నారు అమిత్ షా. అందుకే ఈ పర్యటన ఏపీ బీజేపీకి చాలా కీలకం కానుంది. పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ వంటి వారి పేర్లను అధ్యక్ష స్థానం కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ నెలలోనే పూర్తి విషయాలు తెలియనున్నాయని చెబుతున్నారు ఆపార్టీ నేతలు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*